ఫేక్​ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు

ఫేక్​ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు

ఎల్బీనగర్, వెలుగు : ఫేక్​డిగ్రీ సర్టిఫికెట్లు తయారుచేసి విక్రయిస్తున్న ముఠాను మహేశ్వరం ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మెహిదీపట్నంకు చెందిన మహ్మద్ అబ్రార్ హుస్సేన్(45) కొంతకాలంగా ఫేక్​సర్టిఫికెట్లు తయారుచేస్తున్నాడు. వాటిని విక్రయించి క్యాష్​చేసుకుంటున్నాడు. సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు శనివారం రైడ్​చేసి, మహ్మద్ అబ్రార్ హుస్సేన్​తోపాటు మధ్యవర్తిని అరెస్ట్​చేశారు.

2 మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఫేక్​డిగ్రీ సర్టిఫికెట్లు తయారుచేసి విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఒక్కో సర్టిఫికెట్​ను రూ.30 వేల నుంచి రూ.40 వేలకు అమ్ముతున్నట్లు తెలిపారు. వీరి వద్ద సర్టిఫికెట్ కొన్న లంగర్ హౌజ్ కు చెందిన సయ్యద్ అహ్మద్(28)ను కూడా పోలీసులు అరెస్ట్​చేశారు.