
జూబ్లీహిల్స్, వెలుగు : డాక్టర్ ఇంట్లో రూ.20లక్షలు చోరీకి గురైన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్రోడ్నంబర్ 52, ప్లాట్నంబర్1061లో ఉండే అశోక్ కుమార్డాక్టర్. ప్రస్తుతం అపోలో పనిచేస్తున్నారు. రోజూలాగే 17న ఉదయం ఉదయం డ్యూటీకి వెళ్లిన అశోక్కుమార్సాయంత్రం 8 గంటలకు తిరిగి వచ్చారు.
ఇంటి మెయిన్డోర్తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా, అల్మారాలో దాచిన రూ.20 లక్షల నగదు కనిపించలేదు. టెర్రస్ పైనుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడినట్లు గుర్తించిన అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.