మ‌ళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించండి: ఢిల్లీ హైకోర్టులో పిల్

మ‌ళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించండి: ఢిల్లీ హైకోర్టులో పిల్

క‌రోనా లాక్ డౌన్ ఆంక్ష‌లు భారీగా స‌డ‌లించ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ.. మ‌ళ్లీ క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లైంది. ఢిల్లీలో రోజు రోజుకూ భారీగా కేసులు పెరుగుతున్నాయ‌ని, క‌ఠినంగా లాక్ డౌన్ అమ‌లు చేయ‌కుంటే ప‌రిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందంటూ ఓ వ్య‌క్తి పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దేశ రాజ‌ధానిలో ఇప్ప‌టి వ‌ర‌కు 33 వేల క‌రోనా కేస‌లు న‌మోదు కాగా.. 984 మంది మ‌ర‌ణించారు. ఇటీవ‌ల కొద్ది రోజులుగా భారీ సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో జూన్ 1 నుంచి ఢిల్లీలో భారీగా ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖ‌లు చేశారు. ఢిల్లీలో మ‌ళ్లీ క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లు చేసేలా ఆదేశించాల‌ని కోరారు. జూలై 31 నాటికి దేశ రాజ‌ధానిలో 5.5 ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల జ‌రిగిన స‌మీక్ష‌లో చెప్పిన విష‌యాన్ని పిటిష‌న‌ర్ కోర్టుకు తెలిపారు.