కస్టమర్స్కు షాక్ ఇచ్చిన జొమాటో

కస్టమర్స్కు షాక్ ఇచ్చిన జొమాటో

చెఫ్ లకు ‘ఫుడ్ ఐటమ్ స్పైసీగా చెయ్. ఆయిల్ తక్కువ వాడండి’ అంటూ కస్టమర్లు సూచనలు ఇస్తుంటారు. కానీ, జొమాటోకు మాత్రం ఇలాంటివి కాకుండా కొత్త సూచనలు ఎక్కువ వస్తున్నాయి. వాటితో విసుగెత్తి పోయిన జొమాటో ‘దయచేసి ఆ సూచనలు ఆపేయండి’ అంటూ ట్వీట్ చేసింది. వాటి వల్ల తమ సర్వీస్ పట్ల అసహనానికి గురవుతున్నట్లు వెల్లడించింది.

జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టిన తర్వాత కుకింగ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో కస్టమర్లు ఎవరికి కావాల్సిన ఇన్‌స్ట్రక్షన్స్‌ వాళ్లు ఇస్తుంటారు. అయితే, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ‘భయ్యా అచ్చా బనానా’ (అన్నా ఫుడ్‌ బాగా వండండి) అని సూచనలు వస్తున్నాయట. దీంతో ఇలాంటి సూచనలు ఆపేయాలని కస్టమర్లను జొమాటో కోరింది. దీనిపై స్పందించిన వినియోగదారులు అవసరాలకు తగ్గట్లు సేవలు అందించాలి కానీ, ఇలా అడ్డు చెప్పడమేంటని కామెంట్లు పెడుతున్నారు.