మోడీ హోర్డింగులను తొలగించాలె: ఈసీ

మోడీ హోర్డింగులను తొలగించాలె: ఈసీ

కోల్‌‌కతా: పెట్రోల్ బంకుల వద్ద ఉన్న ప్రధాని మోడీ హోర్డింగులను తొలగించాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ మోడీ ఫొటోలతో ఉన్న హోర్డింగులను 72 గంటల్లోపు తీసేయాలని పెట్రోల్ పంప్ డీలర్లను ఈసీ ఆదేశించినట్లు ఓ అధికారి తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో మోడీ హోర్డింగులు ఉంచడం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) కిందకు వస్తుందని వెస్ట్ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు రావడంతో పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాంల్లోని పెట్రోల్ బంకుల్లో మోడీ హోర్డింగులను తొలగించనున్నారు.