మన్ కీ బాత్ కోసం మీ ఆలోచనలు పంచుకోండి

మన్ కీ బాత్ కోసం మీ ఆలోచనలు పంచుకోండి

మన్ కీ బాత్ రాబోయే ఎపిసోడ్ కోసం ఆలోచనలు పంచుకోవాలని ప్రజలను ఆహ్వానించారు ప్రధాని మోడీ. ఏప్రిల్ 24న జరిగే 88వ ఎపిసోడ్ కోసం సమస్యలపై ఆలోచనలు పంచుకోవాలన్నారు. MYGOV, NAMO యాప్ ల ద్వారా థాట్స్ షేర్ చేసుకోవచ్చన్నారు. లేదా 1800-11-7800 నంబర్ కు డయల్ చేసి మెసేజ్ రికార్డు చేయవచ్చన్నారు ప్రధాని మోడీ. అట్టడుగు స్థాయి నుంచి మార్పు చేసే.. వారి అసాధారణ విజయాలను జరుపుకుంటున్నామన్నారు. అలాంటి స్ఫూర్తి దాయకమైన ప్రయాణ గురించి తెలిస్తే.. వాటిని వచ్చే ఎపిసోడ్ లో భాగస్వామ్యం చేయండని ట్వీట్ చేసింది పీఎంవో.