ప్రశాంతంగా ముగిసిన లోక్ సభ మూడో దశ పోలింగ్..

ప్రశాంతంగా ముగిసిన లోక్ సభ మూడో దశ పోలింగ్..

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 3వ దశ పోలీంగ్ ముగిసింది. 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 93 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. మూడో దశ పోలింగ్ 60.19 శాతంగా నమోదయిందని ఎన్నికల సంఘం వెల్లడించింది.  అత్యధికంగా అస్సంలో 74.89 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగగా మహారాష్ట్రలోని 11లోక్ సభ స్థానాలకు పోలీంగ్ అత్యల్పంగా 53.40 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ రాజౌరీ లోక్ సభ స్థానానికి ఇవాళ పోలీంగ్ జరగాల్సి ఉండగా వర్షాలు, హిమపాతం దృష్ట్యా పోలింగ్ మే 25వ తేదీకివాయిదా పడింది. మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ, దాని మిత్రపక్షాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 

 మరోవైపు ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సైతం అదే జోష్ కనుపరుస్తుంది. ఈసారి ఎలగైన ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుుతోంది. మరీ ఓటర్ల నాడి ఎలాగుందో తెలియాలంటే ఎన్నిలు మొత్తం ముగిసే వరకు వేచి చూడాల్సిందే.