Pallavi joshi:  సినీనటి పల్లవి జోషికి గాయాలు

Pallavi joshi:  సినీనటి పల్లవి జోషికి గాయాలు

‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా షూటింగ్ ‏లో ప్రముఖ సినీనటి పల్లవి జోషి గాయపడ్డారు. సెట్ లో ఉన్న వాహనం అదుపు తప్పి పల్లవిని ఢీ కొనడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం సినిమా సెట్ నుంచి పల్లవి జోషిని అపోలో ఆస్పత్రికి తరలించారు. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా షూటింగ్ జరుగుతోంది. 

పలు సినిమాలు, టీవీ షోల ద్వారా పల్లవిజోషి ప్రేక్షకులకు పరిచయమే. చాలా బాలీవుడ్‌ సినిమాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు.  బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ కాంబోలో వచ్చిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సెన్సేషనల్ ద్వయం ఇప్పుడు ‘ది వ్యాక్సిన్ వార్‌’ సినిమా రూపొందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత పల్లవి జోషి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.