అక్టోబర్ 2న ప్రపంచ శాంతి సమావేశం

అక్టోబర్ 2న ప్రపంచ శాంతి సమావేశం

అక్టోబర్ 2న జింఖానా గ్రౌండ్ లో ప్రపంచ శాంతి సమావేశం నిర్వహిస్తున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా సహా అందరినీ ఆహ్వానించామన్నారు. 28 దేశాలకు చెందిన ప్రధానులు ఈ సమావేశానికి రానున్నారని చెప్పారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని ఆహ్వానించామన్నారు. వరుణ్ గాంధీని రావొద్దని మంత్రి కేటీఆర్ చెప్పినట్టు స్వయంగా ఆయనే తనకు చెప్పారన్నారు. కాంగ్రెస్ ను వీక్ చేయడానికి సీఎం కేసీఆర్ ను ప్రశాంత్ కిషోర్ పావులా వాడుకుంటున్నారని తెలిపారు. తాను నిర్వహించే  శాంతి సభను కేసీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

శాంతి సభను అడ్డుకునేందుకు ప్రయత్నించే దేవుడి ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ ను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశానని..మునుగోడులో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరామన్నారు. హైదరాబాద్ లో తనకు ఓటర్ ఐడీ కార్డు ఇప్పించాలని కోరానని తెలిపారు.