హైదరాబాద్ కు చేరుకున్నరాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

హైదరాబాద్ కు చేరుకున్నరాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్నారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. ఈ నెల 28 వరకు రాష్ట్రంలో బసచేయనున్నారు.  రాష్ట్రపతికి…. స్వాగతం పలికేందుకు గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ తో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు…. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయం నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటారు. ఈ సందర్భంగా సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు.

రాష్ట్ర పర్యటనలో భాగంగా రేపు(శనివారం) రెడ్ క్రాస్ సొసైటీ మొబైల్ యాప్ ను రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. ఎల్లుండి(డిసెంబర్-23) పాండిచ్చేరి యూనివర్సిటీ స్నాతకోత్సవం నేపథ్యంలో పుదిచ్చేరికి వెళ్లనున్నారు. అక్కడి నుంచి 25న కన్యాకుమారికి వెళ్లి వివేకానంద రాక్ మెమోరియల్ ను సందర్శిస్తారు.

ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి… ఈ నె 27న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు, అదికారులతో సమావేశం కానున్నారు. 28న తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

రాష్ట్రానికి రాష్ట్రపతి వస్తుండటంతో… బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లను పరిశీలించారు గవర్నర్ తమిళిసై.