ఐడియా అదిరిందే : బార్ అండ్ రెస్టారెంట్లలో ఇక నుంచి కల్లు అమ్మకాలు..!

ఐడియా అదిరిందే : బార్ అండ్ రెస్టారెంట్లలో ఇక నుంచి కల్లు అమ్మకాలు..!

అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు టూరిస్ట్‌ సీజన్‌లో రెస్టారెంట్లలో బీరు, బార్‌లలో కల్లు విక్రయించాలని కేరళ ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాలు సిఫార్సు చేశాయి. లైసెన్సు రుసుమును  రూ.1 లక్షగా డ్రాఫ్ట్ సిఫార్సు చేసింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ త్రీ స్టార్‌ హోటల్స్ గా  వర్గీకరించిన బార్‌లు, టూరిజం రిసార్ట్‌లలో కల్లును విక్రయించాలని సూచించింది.  ఈ సిఫార్సులను  కేరళ ప్రభుత్వం మద్యం పాలసీలో ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత  ఈ పాలసీని అమలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. 

కల్లుగీత రంగానికి పునరుజ్జీవం కల్పించే లక్ష్యంతో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  2021 అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం ఈ వాగ్దానం చేసింది.  లైసెన్సు ఇచ్చే విధివిధానాలను పర్యాటక శాఖతో సంప్రదించి రూపొందించనున్నారు. బార్ లైసెన్స్ ఫీజులను రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షలకు పెంచనున్నారు. 2016లో దశలవారీ మద్యపాన నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన బార్ లైసెన్స్ పరిమితులను సడలించింది.