పోసాని విసుర్లపై స్పందించిన పృథ్వీ

పోసాని విసుర్లపై స్పందించిన పృథ్వీ

రాఘవేంద్రరావు పనితీరుపై దర్యాప్తు చేయిస్తాం

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్

హైదరాబాద్ : కలలో కూడా ఊహించని పదవిని సీఎం జగన్ అందించారని సినీ నటుడు, ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ పృథ్వీ అన్నారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సినీనటుడు పోసాని కృష్ణమురళి తనకు అన్నయ్యలాంటివాడనీ.. ఆయన నిజాయితీ కలిగిన వ్యక్తి అని చెప్పారు. తమ ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. ఇటీవలే ఓ ప్రెస్ మీట్ లో… సినిమా ఇండస్ట్రీ నుంచి జగన్ కు ఎటువంటి సపోర్ట్ లేదని పృథ్వీ చెప్పడాన్ని తప్పుపట్టారు పోసాని. ఐతే.. పోసానిపై తనకు అభిప్రాయభేదాలేవీ లేవని పృథ్వీ అన్నారు.

ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ గా… భక్తుల మనోభావాలకు ప్రాధాన్యత ఇస్తానని.. ఆధ్యాత్మిక విలువలు పెంచి నంబర్ వన్ ఛానెల్ గా చేస్తానని అన్నారు పృథ్వీ. “జులై 28 తేదీన ఎస్వీబీసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశాను. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎప్పటికr రుణ పడి ఉంటాను. ఎస్వీబీసీ ఛానెల్ ని నిబద్ధతతో నడిపిస్తాను. రాజకీయలకు అతీతంగా పనిచేస్తాను. తిరుమలలో రాజకీయాలు మాట్లాడను. అమరావతి లోనే రాజకీయాలు మాట్లాడుతా. గతంలో జరిగిన అవినీతిని వెలికితీస్తా. గతంలో రాఘవేందర్ రావు ఉన్నా.. మరెవరూ ఉన్నా విచారణ తప్పదు. ఎస్వీబీసీలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాను. ఎస్వీబీసీ కోసం నిబద్దతతో పనిచేస్తా. రాఘవేందర్ రావుతో నాకు ఎలాంటి పోటీలేదు. ఏం జరిగినా.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అన్నారు పృథ్వీ.