చల్లబడిన వాతావరణం.. మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు..

 చల్లబడిన వాతావరణం..  మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు..

తెలంగాణలోని వాతావరణం చల్లబడింది. ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

హైదరాబాద్ లోని కొంపల్లి, నిజాంపేట్, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.మియాపూర్ లో వడగండ్ల వాన కురిసింది. మరో 3 గంటలు ( మే 7  సాయంత్రం 6 గంటల నుంచి) హైదరాబాద్ లో జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

మంగళవారం  ( మే 7) మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి... ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్‌, కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, ములుగు జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం పడింది.ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మానుకొండూర్‌, హుజూరాబాద్‌, పెద్దపల్లి, మల్యాల, పెగడపల్లి, వేములవాడ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతం అయ్యింది. కరీంనగర్ లో భారీ వర్షం కురిసింది.

రాష్ట్రానికి వర్ష సూచన

 మరో మూడు రోజుల పాటు ( మే 7 నుంచి) తెలంగాణలో  రాష్టంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ శాఖ  తెలిపింది.   భారీ వర్షాల నేపథ్యంలో పలు  జిల్లాలకు  ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.  ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో  9 జిలాల్ల కు హెవీ రైన్ అలెర్ట్ ప్రకటించారు.  ఉరుములు, మెరుపులు , గంటకు 40నుండి 50కిమీ వేగం తో ఈదురుగాలులు తో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
 
 ఈరోజు ( మే 7 ) సాయంత్రం  ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో , తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసాయి.   రేపు ( మే 8)  ఉరుములు మెరుపుల, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన తేలికపాటి నుంచిఒక మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.  అదిలాబాద్ ,కొమర భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ,కరీంనగర్,  పెద్దపల్లి ,జయశంకర్ భూపాలపల్లి ,నల్గొండ ,సూర్యాపేట ,వరంగల్, హనుమకొండ, జనగాం ,సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్​,సంగారెడ్డి.మెదక్, కామారెడ్డి, మహబూబ్​ నగర్​,  నాగర్ కర్నూల్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు.