Gold & Silver : 18, 22, 24 క్యారట్ల బంగారం, వెండి ధరలు

Gold & Silver : 18, 22, 24 క్యారట్ల బంగారం, వెండి ధరలు

ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో ఆర్దిక వ్యవస్త అప్ అండ్ డౌన్స్ ఉంది. ఈ క్రమంలోనే పెట్టుబడిదారులు తమ డబ్బును సేఫ్ అండ్ సేఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బంగారం, వెండిలో పెట్టుబడులు భారీగా పెడుతున్నారు వ్యాపారులు. దీంతో వీటి ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. 2026, జనవరి 19వ తేదీన రిటైల్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు.. 18, 22, 24 క్యారట్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ALSO READ : ఇండియా బండ్లకు డిమాండ్..2025లో 63లక్షల బండ్లు ఎగుమతి

బంగారం ధరలు :

18 క్యారట్ల బంగారం గ్రాము 10 వేల 780 రూపాయలుగా ఉంది.
22 క్యారట్ల బంగారం గ్రాము 13 వేల 180 రూపాయలుగా ఉంది.
24 క్యారట్ల బంగారం గ్రాము 14 వేల 380 రూపాయలుగా ఉంది. 

ఇక వెండి విషయానికి వస్తే.. ఆకాశానికి హద్దే లేదు అన్నట్లు పెరిగిపోతుంది. కిలో వెండి హైదరాబాద్ సిటీలో 3 లక్షల 9 వేల రూపాయలకు చేరింది. ఇది ఆల్ టైం రికార్డ్ ధర. రాబోయే రోజుల్లో వెండి మరింత పెరుగుతుందన్న అంచనాలతో.. వెండిపై ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడి పెడుతున్నారు వ్యాపారులు. 

ALSO READ : తొలిసారిగా లాభాల్లోకి డిస్కమ్‌‌‌‌‌‌‌‌లు..

ఇదే సమయంలో పారిశ్రామిక అవసరాల కోసం పెద్ద మొత్తంలో వెండికి ఆయా కంపెనీలు ఆర్డర్లు ఇవ్వటంతో ధర దిగిరాకపోగా.. రోజు రోజుకు మరింత పెరుగుతుంది.