నాచారం, వెలుగు: బీర్ తాగేందుకు వెళ్లిన ఓ మద్యంప్రియుడికి ఊహించని షాక్ తగిలింది. బీర్ బాటిల్‌లో చేపపిల్ల కనిపించడంతో అవాక్కయ్యాడు. హైదరాబాద్ మల్లాపూర్ లోని జేపీ వైన్ షాప్‌లో ఓ వ్యక్తి కింగ్ఫిషర్ లైట్ బీర్ కొన్నాడు. మూత తీయగానే అందులో చేప పిల్ల కదులుతూ కనిపించింది. ఆశ్చర్యానికి గురై షాపు నిర్వాహకులను ప్రశ్నించాడు. బీర్ తమ దగ్గర తయారు కాలేదని, తయారు చేసిన కంపెనీని అడగాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు బాధితుడు ఆరోపించాడు.
