మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటిలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం (జనవరి 19) జరిగిన ఈ సంబరాల్లో కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలక మహిళలకు కోటి69 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేశారు.
మున్సిపాలిటీ లో ఏర్పాటుచేసిన మహిళ సంఘాల క్యాంటీన్ ను ప్రారంభించారు మంత్రి వివేక్. అదేవిధంగా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ డెవలప్మెంట్ ఫండ్18 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నార్లపూర్, బురదగూడెం, పోచమ్మ టెంపుల్, శ్రీపతినగర్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Also Read : V6 వెలుగులో వార్తకు స్పందన.. చిన్నారులకు ఇల్లు కట్టిస్తున్న వరంగల్ జిల్లా నెక్కొండ ఎస్సై
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్.. మహిళా స్వయం సహాయ సంఘాల అభివృద్ధి కోసం వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంక్ లు, కుట్టుమిషన్ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం అందించేందుకు మహిళల సంఘాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అందించే వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. ఆరు నెలల్లో అమృత్ స్కీమ్ పథకం ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నట్లు చెప్పారు. మణుగూరు, మందమర్రి మున్సిపాలిటీలు ఏజెన్సీ ఏరియాలు కోర్టు పరిధిలో ఉండడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదని తెలిపారు.
ములుగు క్యాబినెట్ లో మందమర్రి, ములుగు మున్సిపాలిటీ ల గురించి సీఎం తో చర్చంచినట్లు తెలిపారు. ఎమ్మెల్యే గా గెలుపొందాక మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియకోసం కలెక్టర్ ద్వారా కోర్టులో కౌంటర్ దాఖలు చేశామని తెలిపారు. 50 శాతం పదవులు ఎస్టీలకు, చైర్మెన్ ఎస్టీ కి రిజర్వ్ అవుతుందని..ఈ ప్రతిపాదనను ఒప్పుకుంటే ఎన్నికలకు వీలవుతుందని తెలిపారు.
