- ఇంటి నిర్మాణానికి స్థానికులతో కలిసి భూమిపూజ
- అభినందించిన వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్
నెక్కొండ (వరంగల్): వరంగల్ జిల్లా నెక్కొండ పోలీస్ స్టేషన్ ఎస్సై మహేందర్ తన సేవాగుణంతో ప్రజల మనసులు గెలవడమే కాకుండా డిపార్టుమెంట్ పెద్దల అభినందనలు పొందారు. మండలంలోని పెద్ద కోర్పోల్ గ్రామానికి చెందిన తాళ్లపెళ్లి ఏలియా, మమత దంపతులు కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. కనీస ఇల్లు లేక పేదరికంతో ఇద్దరు కూతుళ్లు జెస్సీ, వర్షిత అనాథలయ్యారు.
ఈ క్రమంలో గత డిసెంబర్ నెలలో వీ6 వెలుగు పేపర్లో 'అమ్మానాన్నలేరు.. ఇల్లు లేదు' శీర్షికన వార్త ప్రచురితమైంది. ఈ కథనాన్ని చూసిన నెక్కొండ ఎస్సై మహేందర్ చలించారు. సాయం చేయడానికి మంచి ఆలోచన చేసి అడుగు ముందుకేశారు.
చిన్నా రులు నివాసం ఉండటానికి రెండు గదుల ఇల్లు నిర్మించేలా ఇవాళ స్థానికులతో కలిసి భూమి పూజ చేశారు. ఇదే విషయం పోలీస్ శాఖ పె ద్దలకు చేరింది. దీంతో వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఎక్స్ వేదికగా ఎస్సై మహేందర్ కు అభి నందనలు తెలిపారు.
