నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్‌కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా జీ.వీ. శ్యామ్ ప్రసాద్ లాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జ్ అడిషనల్ కలెక్టర్ దేవ సహాయం నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ బాదావత్ సంతోష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణపై చర్చించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అడిషనల్ కలెక్టర్‌ను వివిధ శాఖల అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
