శర్వానంద్ హీరోగా నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘బైకర్’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో శర్వానంద్ డేరింగ్ ప్రొఫెషనల్ మోటార్‌సైకిల్ రేసర్‌గా కనిపించనున్నాడు. ఏప్రిల్ 3న సినిమా విడుదల కానుంది.
గురువారం ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని చెప్పారు. విజువల్స్, సౌండ్ డిజైన్, హై-ఆక్టేన్ యాక్షన్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటు న్నామని, ప్రతి బైక్ రోర్, ఎమోషనల్ సీన్ ప్రేక్షకులకు మరింత ఇమర్సివ్ థియేట్రికల్ అనుభూతిని అందిస్తుందని తెలిపారు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ‘బుల్లెట్ సునీల్’ అనే ఎక్స్ మోటోక్రాస్ లెజెండ్‌గా రాజశేఖర్ నటిస్తున్నారు. జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.
