ట్రంప్‎కు బిగ్ షాక్.. గ్రీన్ ల్యాండ్‎లో భారీగా దళాలను దింపిన యూరోపియన్ దేశాలు

ట్రంప్‎కు బిగ్ షాక్.. గ్రీన్ ల్యాండ్‎లో భారీగా దళాలను దింపిన యూరోపియన్ దేశాలు

వాషింగ్టన్: ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ ల్యాండ్‎ను స్వాధీనం చేసుకుని తీరుతామంటూ ట్రంప్ నియంతలా వ్యవహరిస్తుండటంతో అమెరికా, యూరోపియన్ యూనియన్ (EU) దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ట్రంప్ నిర్ణయాన్ని యూరోపియన్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తగ్గేదే లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తు్న్నారు. 

తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే వాణిజ్య సుంకాలు విధిస్తానని ఈయూ దేశాలను హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో ఈయూ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గ్రీన్‌ల్యాండ్‌కు మద్దతుగా ఆ దేశంలో యూరోపియన్ కంట్రీస్ తమ సైనిక సిబ్బందిని మోహరించాయి. జర్మనీ 13 మంది సిబ్బందితో కూడిన నిఘా బృందాన్ని పంపింది.  

Also Read : ఉన్నది రెండు గంటలే.. కానీ అందరి చూపు ఈ భేటీపైనే

నార్వే ఇద్దరు సైనిక సిబ్బందిని, నెదర్లాండ్స్ ఒక నావికాదళ అధికారిని గ్రీన్‌ల్యాండ్‌కు పంపాయి. అదేవిధంగా యూకే కూడా ఒక సైనిక బృందాన్ని గ్రీన్ ల్యాండ్‎కు తరలించింది. ఫ్రాన్స్ 15 మంది, స్వీడన్ ముగ్గురు, ఫిన్లాండ్ ఇద్దరు సైనికులను పంపాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా గ్రీన్ ల్యాండ్ లో సైన్యాన్ని మోహరించడం ప్రపంచ దేశాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఈయూ దేశాల నిర్ణయంపై ట్రంప్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

అమెరికా రక్షణలో భాగంగా గ్రీన్ ల్యాండ్‎ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయాన్ని పలు దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా డెన్మార్క్, యూకే, ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలు అమెరికా నిర్ణయాన్ని తప్పుబట్టాయి. దీంతో ఆగ్రహానికి గురైన ట్రంప్ నా నిర్ణయాన్నే వ్యతిరేకిస్తారా అని.. డెన్మార్క్, యూకే, ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలపై 10 శాతం ట్రేడ్ టారిఫ్‎లు విధించాడు. 2026, ఫిబ్రవరి 1 నుంచి ఈ సుంకాలు అమలులోకి రానున్నట్లు ప్రకటించాడు. మరోవైపు అమెరికా సుంకాలను ఈయూ కంట్రీస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.