యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడి ఇండియా పర్యటనపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కేవలం రెండు గంటల పర్యనటలో భాగంగా సోమవారం (జనవరి 19) ఇండియా చేరుకున్నాడు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్. యూఏఈ ప్రసిడెంట్ కోసం ఏకంగా ప్రోటోకాల్ బ్రేక్ చేసి ప్రధాని మోదీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లి ఆహ్వానించారు.
ఇద్దరు నేతలు కౌగిలింతలు ఇచ్చుకుంటూ.. శుభాకాంక్షలు చెప్పకుంటుండటం చూస్తుంటే ఇండియా-యూఏఈ మధ్యన ఉన్న వ్యక్తిగత బంధం ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. రెండు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య, ఇంధన, ప్రాంతీయ భద్రతలో భాగంగా ఇది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నదిగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
Also Read : టెక్కీ మరణంపై సిట్ దర్యాప్తుకు ఆదేశించిన సీఎం యోగి
వెల్ కమ్ మై బ్రదర్: పీఎం మోదీ
యూఏఈ అధ్యక్షుడు ఇండియా వచ్చిన తర్వాత మోదీ ఎక్స్ లో చేసిన పోస్టును బట్టీ వీరిద్దరి భేటీ ఎంత ముఖ్యమైనదో చెప్పవచ్చు. మా బ్రదర్ కు వెల్ కమ్ చెప్పేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లాను.. ఇండియా-యూఏఈ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏంటో ఇది ప్రత్యక్ష సాక్షి... అంటూ మోదీ పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన వచ్చినప్పటికీ.. ఇది మోదీ పీరియడ్ లో ఆయనకు మూడో ట్రిప్ అవుతుంది.
ఎందుకంత ప్రాధాన్యత..?
ఒకవైపు ఇరాన్ మండుతోంది.. పౌరుల ఆందోళనతో భగ్గుమంటోంది.. దాదాపు 5 వేలకు పైగా చనిపోయారు. దాడి చేస్తామంటూ ట్రంప్ బెదిరింపులు.. మరోవైపు గాజా అనిశ్చితి.. శాంతి స్థాపన అంటూ అమెరికా ముందుకెళ్తోంది.. మరోవైపు ఇజ్రాయెల్ మధ్య మధ్యలో ఆయుధాలకు పనిచెబుతోంది. ఇటు యెమెన్ లో కూడా ఏళ్లతరబడి అంతర్యుద్ధం కొనసాగుతోంది. పశ్చిమ ఆసియాలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇరు దేశాల నేతల కలియిక ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండేలా ఈ భేటీలో చర్చించనున్నారు. ఇంధనం, దేశ భద్రత, వాణిజ్యంలో పరస్పర సహకారంఉండేలా, పశ్చిమ ఆసియా అనిశ్చితిపై వైఖరి మొదలైన అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నా రు.
