ఇరాన్తో యుద్ధం.. అమెరికా పెట్టిన ఖర్చు రూ.6,900 కోట్లు.. అయినా సైన్యానికి ఆయుధాల కొరత

ఇరాన్తో యుద్ధం.. అమెరికా పెట్టిన ఖర్చు రూ.6,900 కోట్లు.. అయినా సైన్యానికి ఆయుధాల కొరత

న్యూఢిల్లీ: ఇరాన్‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం భారీగా పడుతున్నది. పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్ నివేదిక ప్రకారం.. ఇరాన్‌‌‌‌‌‌‌‌పై దాడులకు అమెరికా మొదటి 24 గంటల్లోనే సుమారు 779 మిలియన్ (దాదాపు రూ. 6,900 కోట్లు) డాలర్లు  ఖర్చు చేసింది.  ఇరాన్‌‌‌‌‌‌‌‌తో యుద్ధం సుమారు నెల రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

 నెలపాటు కొనసాగితే అమెరికా దాదాపు 210 బిలియన్ (రూ.18.87 లక్షల కోట్లు) డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్ డైరెక్టర్ కెంట్ స్మెట్టర్స్ అంచనా వేశారు. ఇక న్యూ అమెరికన్ సెక్యూరిటీ డేటా ప్రకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక అయిన 'యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్' వంటి క్యారియర్ స్ట్రైక్ గ్రూపుల నిర్వహణకే అమెరికాకు రోజుకు 6.5 మిలియన్ (రూ. 58 కోట్లు) డాలర్లు ఖర్చవుతున్నది. 

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, ఇతర కీలక వ్యక్తులపై దాడుల కోసం అమెరికా ఇప్పటికే వెస్ట్​ ఏసియాలో రెండు విమాన వాహక నౌకలతో పాటు భారీగా సైన్యాన్ని మోహరించింది. ఇందుకోసం సుమారు 630 మిలియన్ (రూ. 5,556 కోట్లు)డాలర్లు వ్యయమైనట్లు తెలుస్తోంది. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌కు అమెరికా ఇప్పటిదాకా 31.35 బిలియన్ డాలర్ల నుంచి 33.77 బిలియన్ (సుమారు రూ. 3.04 లక్షల కోట్లు) డాలర్ల వరకు ఖర్చు చేసింది.

అమెరికా వద్ద తగ్గుతున్న ఆయుధాలు

సైనిక సమీకరణ కోసమే అమెరికా  రూ.5,556 కోట్లు ఖర్చుచేసింది. అమెరికాకు నిధులు కాదని సమస్య కాదని, ఆయుధాల సంఖ్య తగ్గడమే అసలు సమస్యని తెలిపాయి. ముఖ్యంగా ఇరాన్ విసిరే మిసైల్స్​ను అడ్డుకునే 'ఇంటర్ సెప్టర్' క్షిపణుల తయారీకి చాలా సమయం పడుతుంది. దీంతో  యుద్ధం నెలపాటు కొనసాగితే అమెరికా రక్షణ సామర్థ్యంపై ప్రభావం పడవచ్చు. 

ఉక్రెయిన్, ఆసియా ప్రాంతాల కోసం అమెరికా కేటాయించిన ఆయుధ నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉందని స్టిమ్సన్ సెంటర్ నిపుణుడు క్రిస్టోఫర్ ప్రిబుల్ పేర్కొన్నారు. ఇరాన్​లోని 130 ప్రాంతాల్లో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరపగా..ఇప్పటిదాకా సుమారు 555 మంది మరణించారు. 1,250కి పైగా లక్ష్యాలను, 11 ఇరాన్ నౌకలను అమెరికా ధ్వంసం చేసింది.

యుద్ధంలో ఉపయోగిస్తున్న ఆయుధాలివే..

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికా వైమానిక, సముద్ర, భూమి, క్షిపణి రక్షణ దళాలకు చెందిన 20 కంటే ఎక్కువ ఆయుధ వ్యవస్థలను ఉపయోగించింది. వాయు, సముద్ర, భూభాగాల్లోని 20 విభిన్న ఆయుధ వ్యవస్థలను ఉపయోగించి ఇరాన్ లోపల 1,000 కంటే ఎక్కువ లక్ష్యాలను ధ్వంసం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌ల దృష్టి ప్రస్తుతం ఇరాన్ ఆయుధ సామర్థ్యాలను వీలైనంత త్వరగా దెబ్బతీయడం లేదా తగ్గించడంపైనే ఇందని నివేదిక వెల్లడించింది. 

అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న ఆయుధాల్లో  బి-1 బాంబర్లు, బి-2 స్టీల్త్ బాంబర్లు, ఎఫ్-35, ఎఫ్-22 స్టీల్త్ ఫైటర్లు, ఎఫ్-15, ఎఫ్-16, ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్. ఏ-10 అటాకర్ జెట్స్ వంటి వైమానిక ఆయుధాలున్నాయి. అలాగే, లూకాస్ డ్రోన్లు , ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు, హిమర్స్ రాకెట్ ఆర్టిలరీ, టోమాహాక్ క్రూయిజ్ వంటి డ్రోన్లు, మిసైల్స్ కూడా ఉన్నాయి.