ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో కారు నీటి గుంతలోపడటంతో సాఫ్ట్ వేర్ మృతిచెందాడు.సెక్టార్ 150లో జరిగిన ఈ ప్రమాదంలో 27ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ యువరాజ్ మెహతా చనిపోయాడు. అయితే బాధితుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో రెస్క్యూ టీం వివాదంలో పడింది. గుంతలో పడ్డ తన కొడుకును రక్షించేందుకు రెస్క్యూ టీం నిరాకరించిందని చనిపోయిన మెహతా పేరెంట్స్ ఆరోపించడం ఆందోళన రేకెత్తించింది.
గుంతలో చల్లటి నీళ్లు ఉన్నాయి.. అంత చల్లని నీటిలోకి మేం దిగలేం అంటూ తన కొడుకును బయటికి తీసేందుకు రెస్క్యూ టీం ఆలస్యం చేసిందని మెహతా పేరెంట్స్ ఆరోపించారు. మూడు టీంలలో సుమారు 80 మంది సిబ్బంది ఉన్నా టెకీ రక్షించేందుకు సాహసించలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఘటన అత్యవసర పరిస్థితులకు స్పందించే సామర్థ్యంపై చర్చకు దారి తీసింది.
శనివారం తెల్లవారు జామున గ్రేటర్ నోయిడా పరిధిలోని సెక్టార్ 150 సమీపంలో యువరాజ్ మెహతా కారు నీటి గుంతలో పడింది. ప్రమాదం సమయంలో యువరాజ్ కు ఫోన్ చేసిన అవుట్ ఆఫ్ కవరేజ్ లో ఉండటంతో గుర్తించలేకపోయారు. అయితే కారులో ఉన్న యువరాజ్ ఫోన్ టార్చ్ ఆన్ చేయడంతో అతడిని గుంతలో ఉన్నట్లు గుర్తించారు. ఎవరైనా నీటి అడుగుకు వెళ్లి యువరాజ్ ను రక్షించేందుకు సాహసించలేదు. పోలీసులు తాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు కానీ ఫలితం లేకుండా పోయిందని యువరాజ్ తండ్రి మీడియాకు తెలిపారు.
►ALSO READ | విజయ్‌కి మళ్లీ సమన్లు.. మరోసారి విచారణకు సీబీఐ ఆదేశం
గుంతలో నీళ్లు గడ్డ కట్టేంత చల్లగా ఉండటం, నీటి అడుగున ఉన్న ఇనుప చువ్వలతో ప్రమాదం ఉన్నదని రెస్క్యూటీం నీటిలోకి దిగేందుకు నిరాకరించారని, దీంతో తన కొడుకు ప్రాణాలు కోల్పోయాడని యువరాజ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) స్పాట్ లో ఉన్నప్పటికీ యువరాజ్ ను రక్షించేందుకు ప్రయత్నం జరగలేదని ఆరోపించారు.
ఈ విషాద ఘటనపై నోయిడా అదనపు పోలీస్ కమిషనర్ కు బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు
