T20 World Cup: ఇంగ్లాండ్పై భారత్ గెలవడం కష్టం.. పాక్ మాజీ క్రికెటర్ బోల్డ్ ప్రెడిక్షన్

T20 World Cup: ఇంగ్లాండ్పై భారత్ గెలవడం కష్టం.. పాక్ మాజీ క్రికెటర్ బోల్డ్ ప్రెడిక్షన్

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరగనున్న ఈ కీలక మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఇప్పటికే సూపర్-–8 దశలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్ జట్టు.. ఆ దేశ మాజీ క్రికెటర్లు మాత్రం ఈ మ్యాచ్‌పై పిచ్చి కూతలు కూస్తున్నారు. మాజీ పాకిస్థాన్ కెప్టెన్ రషీద్ లతిఫ్ ‘హార్నా మనా హై’ అనే కార్యక్రమంలో  మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. ఎందుకంటే, కఠినమైన పరిస్థితుల్లోనూ వారు బాగా ఆడుతున్నారు.. ఆ జట్టులో ఇద్దరు లేదా ముగ్గురు బ్యాటర్లు ఫామ్‌లో ఉన్నారు.. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ చాలా బలంగా ఉందని  కామెంట్స్ చేశాడు. 

వాంఖెడే మైదానంలో పరిస్థితులు కూడా ఇంగ్లాండ్‌కు అనుకూలంగా ఉండొచ్చని రషీద్ లతిఫ్ పేర్కొన్నారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో ఒక్కరు మంచి ప్రదర్శన చేసినా భారత్‌ ఓడిపోవడం పక్కా అని వ్యాఖ్యానించాడు. ఈ టోర్నీ ప్రారంభంలో ఇంగ్లాండ్ జట్టు ఆశించిన విధంగా ప్రదర్శన చేయలేకపోయింది.. అయినప్పటికీ క్రమంగా పుంజుకుని సెమీఫైనల్‌కు చేరుకుంది అన్నాడు. గ్రూప్ దశలో నేపాల్, ఇటలీపై కష్టపడి గెలవగా, వెస్టిండీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. సూపర్-8 దశలో మాత్రం శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై అద్భుతంగా ఆడిన ఇంగ్లాండ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.  

ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా ఈ మ్యాచ్‌పై నమ్మకం వ్యక్తం చేశాడు. క్లోజ్ మ్యాచ్‌లలో కూడా గెలవడం మాకు అలవాటు.. ఆటలో ఎప్పుడూ నిరాశ చెందోద్దు అని నేను నేర్చుకున్నాను.. మా ప్లేయర్స్ లో గెలవాలనే తపన ఉంది.. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఆడగల సామర్థ్యం మాకు ఉందని వెల్లడించాడు. భారత్‌తో మ్యాచ్ ఆడాలని మా జట్టులో చాలా మంది ముందే కోరుకున్నారు.. ఇది చాలా పెద్ద మ్యాచ్.. ఇరు జట్లపై కూడా ఒత్తిడి ఉంటుంది.. ఇండియన్స్ కి వారి అభిమానుల నుంచి మద్దతు ఉంటుంది.. వాంఖడే స్టేడియం మొత్తం సూర్య సేనకు సపోర్టు చేస్తుంది.. అయినప్పటికీ మేము మా ఆటను ప్రదర్శించాలని ఆశిస్తున్నాం..  జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్ ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారని బ్రూక్ పేర్కొన్నాడు.