క్రికెట్ దిగ్గజం , భారతరత్న సచిన్ టెండ్యూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తన చిరకాల స్నేహితురాలు సానియా చందోక్ వివాహ బంధంతో ఒకటయ్యారు. ముంబై నగరంలో అంత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. మార్చి 5వ తేదీన జరిగిన ఈ 'స్టార్ స్టడెడ్' వివాహం.. అటు క్రీడా లోకం, ఇటు సినీ గ్లామర్, రాజకీయ ప్రముఖుల కలయికతో ఒక మెగా ఈవెంట్‌గా నిలిచింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైభవంగా పెళ్లి వేడుక
ఈ వివాహానికి ముందు మార్చి 3, 4 తేదీల్లో ముంబైలో హల్దీ, సంగీత్ వేడుకలు ఎంతో సందడిగా జరిగాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ ప్రి-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో సచిన్ కుటుంబం ఎంతో ఉత్సాహంగా పాల్గొంది. గురువారం జరిగిన ప్రధాన వివాహ వేడుకకు ముంబైలోని ప్రముఖ వేదిక వేదికైంది. సచిన్ తనయుడి పెళ్లి కావడంతో టీమ్ ఇండియా మాజీ, ప్రస్తుత ఆటగాళ్లంతా తరలివచ్చారు.
Arjun Tendulkar, the son of Sachin Tendulkar, got married to Saaniya Chandhok today in Mumbai.❤️
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 5, 2026
Congratulations to Arjun and Saaniya. Best wishes for a happy life together. 💐 pic.twitter.com/HhkU9is64F
ఈ వేడుకలో మహేంద్ర సింగ్ ధోని - సాక్షి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి దిగ్గజాలు నూతన వధూవరులను ఆశీర్వదించారు. అర్జున్ సన్నిహిత మిత్రులు శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, సురేష్ రైనా తమ కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఐసీసీ చైర్మన్ జై షా కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
At Arjun Tendulkar’s wedding, MS Dhoni was spotted with a phone in his hand.
— Cricketopia (@CricketopiaCom) March 5, 2026
Known for hardly using a mobile, Dhoni was seen moving around with it during the celebrations. pic.twitter.com/HuTV7I2bwt
గ్లామర్ అద్దిన బాలీవుడ్
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి హాజరై సందడి చేశారు. అలాగే మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ దంపతులు, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ హాజరయ్యారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
King Khan's Arrival With Style at Arjun Tendulkar's Wedding With His Family 💞@iamsrk @sachin_rt #ArjunTendulkar #KING #KINGTitleReveal #ItsKingTime #ShahRukhKhan #SRK #KingKhan pic.twitter.com/JGpwzQZDoT
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) March 5, 2026
రాజకీయ, వ్యాపార దిగ్గజాలు
రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ, నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా ఒకే కుటుంబంగా తరలివచ్చి సచిన్ కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. ఏపీ నుంచి నారా లోకేష్ - బ్రాహ్మణి దంపతులు కూడా ఈ వేడుకకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొత్తం మీదఅర్జున్ - సానియా వివాహం 2026లో అత్యంత వైభవంగా జరిగిన వేడుకగా చరిత్రలో నిలిచిపోనుంది..
Mukesh Ambani with his beautiful family arrived at Arjun Tendulkar wedding 💍 pic.twitter.com/MXr9KIHXvG
— Rupesh Kumar (@drona_17) March 5, 2026
