హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ సీఎస్ సంజయ్ జాజును కోరారు. మంగళవారం సీఎస్‌ను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పీఆర్సీ నివేదికను వెంటనే విడుదల చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
అలాగే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. జనాభాతో సంబంధం లేకుండా కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో 13 శాతం హెచ్ఆర్ఏను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ సెలవుల మంజూరు విషయంలో ప్రస్తుతం ఉన్న ఇద్దరు పిల్లల పరిమితి నిబంధనను తొలగించాలని ప్రతిపాదించారు. తమ వినతులపై సీఎస్ సానుకూలంగా స్పందించారని నేతలు తెలిపారు.
