చెన్నై: తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్‌కి సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. తమిళనాడులో కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సోమవారం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఈ నెల 12న విజయ్ సీబీఐ విచారణకు హాజరయ్యారు.
అలాగే, టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ బుస్సి ఆనంద్, ఎలక్షన్ మేనేజ్‌మెంట్ డివిజన్ జనరల్ సెక్రటరీ అధవ్ అర్జున, జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా సెక్రటరీ మతియఝగన్‌ను సీబీఐ ఇప్పటికే విచారించింది. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.
