రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం రూ. 35 వేల లంచం..ఏసీబీకి అడ్డంగా దొరికిన జీహెచ్ఎంసీ ఉద్యోగి

రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం రూ. 35 వేల లంచం..ఏసీబీకి అడ్డంగా దొరికిన జీహెచ్ఎంసీ ఉద్యోగి

తెలంగాణలో ఏసీబీ వరుస దాడులతో హడలెత్తిస్తోంది. లంచం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తోంది. లంచానికి అలవాటు పడిన అధికారులు  రోజుకో చోట  ఏసీబీకి దొరికిపోతున్నారు .

లేటెస్ట్ గా  మార్చి 5న  సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ  ఏసీబీకి అడ్డంగా దొరికాడు  ఫైనాన్స్ విభాగం ఎగ్జామినర్ ఆఫ్ అకౌంటెంట్  అధికారి  సూర్యవంశీ సంతోష్.రూ.35 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు.

 సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో రిటర్డ్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ , బాధితుడు ఆంజనేయులు రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం రోజు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. అయితే రూ.40 వేల లంచం ఇస్తే ఫైల్ క్లియర్ చేస్తానని ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తున్న  అకౌంట్స్ అధికారి సంతోష్  చెప్పాడు.చివరకు రూ. 35 వేలకు ఒప్పుకున్నాడు. అంత డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు ఆంజనేయులు ఏసీబీని ఆశ్రయించాడు.  ఇవాళ జీహెచ్ఎంసీ కార్యాలంలో  బాధితుడు ఆంజనేయులు నుంచి రూ. 35 వేల లంచం తీసుకుంటుండగా అకౌంటెంట్స్ అధికారి సంతోష్ ను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

►ALSO READ | సీఎం రేవంత్ చేతుల మీదుగా.. మార్చి8న బమృక్‌నుద్దౌలా చెరువు ప్రారంభం