సీఎం రేవంత్ చేతుల మీదుగా.. మార్చి8న బమృక్‌నుద్దౌలా చెరువు ప్రారంభం

సీఎం రేవంత్ చేతుల మీదుగా..  మార్చి8న బమృక్‌నుద్దౌలా చెరువు ప్రారంభం

బతుకమ్మ కుంటను పునరుద్ధరించి అందరి ప్రశంసలు పొందిన హైడ్రా మరో   చెరువుకు జీవం పోసింది. ఓల్డ్ సిటీలోని  బమృక్‌నుద్దౌలా చెరువును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా   మార్చి  8న సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం బమృక్‌నుద్దౌలా  చెరువును ప్రారంభిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.  

బమృక్‌నుద్దౌలా  చెరువు వద్ద ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన హైడ్రా కమిషనర్  రంగనాథ్..పనులను  స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు.  చెరువు కట్టతో పాటు ఖాళీ ప్రదేశాల్లో నాటిన ఔషధ  మొక్కలు, పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్లే ఏరియాలను  పరిశీలించారు.  పాతబస్తీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా చెరువు ప్రదాన ధ్వారంను నిర్మించారు.  చెరువు చరిత్ర వివరాలతో ఏర్పాటు చేసిన బోర్డుల పరిశీలించారు రంగనాథ్.  

బమృక్‌నుద్దౌలాకు  255 ఏండ్ల చరిత్ర

హైదరాబాద్ మూడో నిజాం సికందర్ జాకు ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్​ఉద్‌‌దౌలా  బమృక్‌నుద్దౌలా  చెరువును 1770 లో నిర్మించారు. అప్పట్లో ఈ చెరువు 100 ఎక‌‌రాల‌‌కు పైగా విస్తరించి ఉండేది. రాజేంద్రన‌‌గ‌‌ర్‌‌, ఆరాంఘ‌‌ర్‌‌, కాటేదాన్ ప్రాంతాల నుంచి వ‌‌చ్చే వ‌‌ర‌‌ద ఈ చెరువుకు చేరేది. నిజాం కాలంలో మీరాలం ట్యాంక్​ను రాజులు, బుమృక్నుద్దౌలా చెరువును రాణులు స్నానాల‌‌కు వాడుకునేవారు. 

►ALSO READ | హైదరాబాద్ టోలీచౌకిలో బిల్డింగ్ పై నుంచి పడి..ముగ్గురు కార్మికులు మృతి

బమృక్‌నుద్దౌలా చెరువులో వ‌‌న‌‌మూలిక‌‌ల చెట్లు, కొమ్మలు వేసి, దిగువున నిర్మించిన బావిలోకి వ‌‌చ్చిన ఊట నీటిని తాగే వారు. ఔష‌‌ధ‌‌ గుణాలున్న ఈ నీటిని నిజాంలు మాత్రమే తాగేవారు. చెరువు చుట్టూ సువాస‌‌న‌‌లు వెద‌‌జ‌‌ల్లే పూల మొక్కలు పెంచేవారు. ఆ పూల‌‌న్నీ చెరువులో పడేలా చేసి నీటిని సెంటు త‌‌యారీకి వినియోగించేవారు. అర‌‌బ్ దేశాల‌‌కు కూడా ఇక్కడి నీటిని తీసుకువెళ్లేవారని చెప్పుకుంటారు. గతమెంతో ఘనమైన చరిత్ర ఉన్న ఈ చెరువును మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తుండడంతో జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.