మా ఎయిర్ బేస్ లు వాడుకోండి.. యూఎస్, ఇజ్రాయెల్ కు ఫ్రాన్స్ అనుమతి

మా ఎయిర్ బేస్ లు వాడుకోండి.. యూఎస్, ఇజ్రాయెల్ కు ఫ్రాన్స్ అనుమతి

అమెరికా,ఇజ్రాయెల్ కూటమి ఇరాన్  మధ్య భీకర యుద్దం కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఆరో రోజు దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి.  ఈ క్రమంలో పశ్చిమాసియాలోని తమ సైనిక స్థావరాలలో కొన్నింటిపై అమెరికా విమానాలను ఫ్రాన్స్ అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈ వారం ప్రారంభంలో ద్వీపంలోని బ్రిటిష్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడి చేసిన తర్వాత యూరోపియన్ దేశాలు సైప్రస్‌కు నావికా దళాలను పంపుతున్నాయి. 

ఐదు రోజుల్లో ఇరాన్‌పై అమెరికా -ఇజ్రాయెల్ దాడుల్లో  ఇరాన్ లో వెయ్యికి పైగా చనిపోయారు. లెబనాన్‌లో దాదాపు 60 మంది, ఇజ్రాయెల్‌లో దాదాపు డజను మంది మృతిచెందారు. ఆరుగురు అమెరికా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ ఇరానియన్ లక్ష్యాలపై కొత్త దాడులు చేసింది .బీరుట్, చుట్టుపక్కల లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థానాలపై వైమానిక దాడులను కొనసాగిస్తోంది. 

ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతం అంతటా ఇజ్రాయెల్ అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు  చేసింది. కువైట్, బహ్రెయిన్ ,యుఎఇలలో అమెరికాకు చెందిన 20 కి పైగా స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇరాన్ గురువారం ప్రకటించింది. అమెరికా ,ఇజ్రాయెల్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని హత్య చేసినప్పటి నుంచి అమెరికా , పశ్చిమాసియాలోని  దాని మిత్రదేశాలపై టెహ్రాన్ తీవ్ర దాడులు చేస్తోంది.

►ALSO READ | ముదురుతున్న యుద్ధం.. అజర్‌బైజాన్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ డ్రోన్ల దాడి

ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధి ద్వారా రాకపోకలకు ఇరాన్ దాడులు అంతరాయం కలిగించిన తర్వాత చమురు ధరలు పెరిగాయి. ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. బుధవారం ప్రారంభంలో US స్టాక్‌లు సాపేక్షంగా స్థిరంగా కనిపించినప్పటికీ పెరుగుతున్న ఇంధన ఖర్చులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నెమ్మదిస్తాయనే భయంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి.