T20 World Cup: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య హై-ప్రెజర్ మ్యాచ్.. టాస్ గెలిచిన జట్టే ఫైనల్ పోరుకి?

T20 World Cup: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య హై-ప్రెజర్ మ్యాచ్.. టాస్ గెలిచిన జట్టే ఫైనల్ పోరుకి?

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఈరోజు జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు, ఇంగ్లాండ్ తో తలపడబోతుంది. ఈ హై-వోల్టేజ్ పోరు ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడంలో డ్యూ (తేమ) కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. వాంఖెడే క్రికెట్ మైదానం సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలులు సాయంత్రం వేళల్లో స్టేడియంపై ఎఫెక్ట్ చూపిస్తాయి. ముంబైలో సాయంత్రం ఉష్ణోగ్రతలు తగ్గే సమయంలో గాలిలోని డ్యూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫీల్డింగ్ చేసే టీమ్ కి బౌలింగ్ చేయడం కష్టమవుతుంది. తేమ కారణంగా బంతి చేతిలో పట్టుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యంగా స్పిన్నర్లకు బంతి టర్న్ కాకపోవడంతో కష్టంగా మారుతుంది. ఫాస్ట్ బౌలర్లు కూడా లైన్, లెంగ్త్‌ను కంట్రోల్ చేయడంలో నానా అవస్థలు పడుతారు. 

బ్యాటింగ్ చేసే జట్టుకు లాభం: 
మరోవైపు బ్యాటింగ్ చేసే జట్టుకు ఇది లాభంగా మారుతుంది. తేమతో తడిసిన అవుట్‌ఫీల్డ్ వల్ల బంతి వేగంగా బ్యాట్‌పైకి వస్తుంది. దీంతో బ్యాటింగ్ చేయడం ఈజీ అవుతుంది. వాంఖెడేలో జరిగిన టీ20 మ్యాచ్‌ల గణాంకాలు చూస్తే మొదట ఫీల్డింగ్ చేసిన జట్లు ఎక్కువగా విజయం సాధించాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో 123 సార్లు ముందుగా ఫీల్డింగ్ చేసిన జట్లు గెలవగా, 92 సార్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన జట్లు గెలుపొందాయి. కాగా ఈ టోర్నమెంట్‌లో మాత్రం కొంచెం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ జరిగిన 7 నైట్ మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు తమ స్కోర్‌ను విజయవంతంగా కాపాడుకున్నాయి.  కాగా ఈరోజు ముంబైలో పగటి ఉష్ణోగ్రతలు సుమారు 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండగా.. సాయంత్రం తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గే కొద్దీ డ్యూ ప్రభావం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి 8 గంటల తర్వాత బౌలర్లు కఠిన పరిస్థితులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది.  
 
పిచ్ రిపోర్ట్: 
ముంబైలో ఇటీవల ఎండలు తీవ్రంగా ముదిరిపోయాయి. దీంతో ఎర్ర మట్టి పిచ్ త్వరగా ఎండిపోకుండా ఉండేందుకు క్యూరేటర్లు పిచ్‌పై స్వల్పంగా గడ్డిని ఉంచేశారు. మ్యాచ్‌కు ముందు చివరి ట్రిమ్ తర్వాత ఈ గడ్డి కొంత తగ్గే ఛాన్స్ ఉంది. ఈ పిచ్‌లో సాధారణంగా వాంఖెడేకు ప్రత్యేకమైన స్పీడ్ అండ్ బౌన్స్ ఉండనుంది. మొదటి ఇన్నింగ్స్‌లో పిచ్ కాస్త గట్టిగా ఉండవచ్చు.. అయితే రాత్రి 8 గంటలు ధాటిన తర్వాత డ్యూ కారణంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో పరిస్థితులు పూర్తిగా మారే అవకాశం ఉంది.

టాస్ కీలకం: 
ఈ సెమీఫైనల్‌ మ్యాచ్ లో టాస్ కూడా కీలక పాత్ర పోషించనుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోర్ చేస్తే, ప్రత్యర్థి టీమ్ పై ప్రభావం చూపిస్తుంది. పిచ్ కాస్త కఠినంగా ఉంటే 170+  పరుగులు కూడా మ్యాచ్ ని గెలిపించే అవకాశం ఉంటుంది. అయితే డ్యూ ప్రభావం ఎక్కువైతే రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్లు కూడా సులభంగా ఛేజ్ చేసే ఛాన్స్ ఉంది.  కాబట్టి ఈ స్టేడియంలో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకునే పరిస్థితి నెలకొంది. 

స్పిన్ vs పేస్: 
వాంఖెడే స్టేడియంలో గత రికార్డులను పరిశీలిస్తే ఫాస్ట్ బౌలర్లు ఎక్కువ విజయాన్ని సాధించారు. ఇప్పటి వరకు పేసర్లు 1635 వికెట్లు తీసుకోగా, స్పిన్నర్లు కేవలం 781 వికెట్లు మాత్రమే తీసుకున్నారు.  
* స్పిన్నర్లు: 40 వికెట్లు (సగటు 24.65, ఎకానమీ 8.01)
* పేసర్లు: 43 వికెట్లు (సగటు 27.00, ఎకానమీ 9.10)
* డ్యూ ఎక్కువగా పడితే స్పిన్నర్లకు ఇబ్బందులు మరింత పెరిగే ఛాన్స్