Renu Desai: రాజకీయ ఆరంగేట్రంపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో!

Renu Desai: రాజకీయ ఆరంగేట్రంపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో!

నటి రేణు దేశాయ్ ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరుతున్నారని, అందుకే ఆమె ప్రజల్లోకి వస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమె స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశారు.. నేను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లడం లేదు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ఆపేయండి. ప్రస్తుతం నేను చేస్తున్న సామాజిక సేవతో సంతృప్తిగా ఉన్నాను. పదవుల కోసం ఆశపడే వ్యక్తిని కాదు అని స్పష్టం చేశారు.

నా వ్యక్తిగత జీవితం మీకెందుకు?

ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్‌ను, పవన్ కల్యాణ్ ప్రస్తావనను ప్రతి విషయంలోనూ తీసుకురావడంపై రేణు తీవ్రంగా మండిపడ్డారు. నేను ఒక ప్రెస్ మీట్‌కు వెళ్తే.. అక్కడ నా వ్యక్తిగత జీవితంపై నినాదాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ విడిచిపెట్టింది.. ఇప్పుడు తనకు అర్థమైంది అంటూ నీచమైన కామెంట్స్ చేస్తున్నారు. నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అది నా వ్యక్తిగత విషయం అని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఏ ప్రెస్ వాళ్లను నిందించడంలేదు అని  చెప్పారు.

కుక్కల సంరక్షణ కోసం..

రేణు దేశాయ్ ఎప్పటి నుంచో జంతు ప్రేమికురాలిగా గుర్తింపు పొందారు. వీధి కుక్కల దాడిలో చిన్న పిల్లలు చనిపోతున్న ఘటనల నేపథ్యంలో ఆమె తన వంతుగా పరిష్కారం చూపాలని ప్రయత్నిస్తున్నారు. అయితే, కొందరు దీనిని తప్పుగా అర్థం చేసుకుని, నీ పిల్లలకు కుక్క కరిస్తే తెలుస్తుంది అంటూ శాపనార్థాలు పెడుతున్నారని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.. నేను కుక్కల కోసం మాత్రమే పోరాడటం లేదు, మనుషుల ప్రాణాల కోసం పోరాడుతున్నా. ఎవరి బిడ్డ ప్రాణమైనా ఒకటే. నా బిడ్డల ప్రాణాలను ఇందులో లాగడం ఎంతవరకు సమంజసం? మీకు ఎక్కడైనా వీధి కుక్కలతో సమస్య ఉంటే నా ఎన్జీవోకు లేదా జీహెచ్‌ఎంసీకి సమాచారం ఇవ్వండి. మేమే వచ్చి వాటిని తీసుకెళ్తాం. అంతే కానీ, ఇలా వ్యక్తిగత దాడులు చేయడం సరికాదు అని హితవు పలికారు.

మనుషుల్లోనూ మంచి, చెడ్డ ఉంటారు!

వంద కుక్కల్లో పది మెంటల్ కుక్కలు ఉన్నట్టే, మనుషుల్లో కూడా మంచి వాళ్లతో పాటు కొందరు చెడ్డవాళ్లు ఉంటారని రేణు దేశాయ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేవలం నెగటివ్ థంబ్ నెయిల్స్ కోసం, వ్యూస్ కోసం తన వ్యక్తిత్వాన్ని హననం చేయవద్దని మీడియాకు, యూట్యూబ్ ఛానెళ్లకు విన్నవించారు. రేణు దేశాయ్ చేసిన ఈ వీడియో స్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)