Nagarjuna: 'ధురంధర్'లో విలన్ గా నాగార్జున ఫస్ట్ ఛాయిస్? మిస్ కావడానికి గల షాకింగ్ రీజన్!

Nagarjuna: 'ధురంధర్'లో విలన్ గా నాగార్జున ఫస్ట్ ఛాయిస్? మిస్ కావడానికి గల షాకింగ్ రీజన్!

టాలీవుడ్ లో నాలుగు దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరో అక్కినేని నాగార్జున. రొమాంటిక్ హీరోగా మొదలై.. యాక్షన్, ఫ్యామిలీ, క్లాస్, మాస్ తో పాటు ఇప్పుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ప్రస్తుతం తన 100వ సినిమా దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

 బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన 'ధురంధర్' సినిమాలో విలన్ పాత్ర కోసం మొదట నాగార్జుననే సంప్రదించారట. కథ, క్యారెక్టర్ బాగా నచ్చినప్పటికీ అదేసమయంలో ఆయన రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'కూలీ', ధనుష్ నటించిన 'కుబేర' వంటి సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి జరగడంతో 'ధురంధర్' కు అవసరమైన డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరక ఈ ప్రాజెక్ట్ను వదులుకోవాల్సి వచ్చిందట.

Also Read :  రికార్డుల వేటలో ‘మన శంకర వరప్రసాద్ గారు’..

 దాంతో దర్శకుడు అదిత్య థార్ చివరకు అక్షయ్ ఖన్నాను విలన్ పాత్రకు ఎంపిక చేశారని సమాచారం. అక్షయ్ ఖన్నా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడని విమర్శకులు ప్ర శంసించినప్పటికీ.. ఒకవేళ నాగార్జున ఆ సినిమాలో కనిపించి ఉంటే మరింత పవర్ ఫుల్ గాఉండేదని ఆయన అభిమానులు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో నాగ్ మిస్ అయిన బిగ్ ఛాన్స్ అంటూ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.