స్విగ్గీ డెలివరీ బాయ్ని స్కార్పియోతో వెంబడించి ఢీకొట్టిన డాక్టర్.. ఇంత చిన్న రీజన్ కే నా..?

స్విగ్గీ డెలివరీ బాయ్ని స్కార్పియోతో వెంబడించి ఢీకొట్టిన డాక్టర్.. ఇంత చిన్న రీజన్ కే నా..?

స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఒక డాక్టర్ స్కార్పియో వాహనంతో ఢీకొట్టించిన ఘటన సంచలనంగా మారింది. సోమవారం (జనవరి 19) న్యూఢిల్లీలోని గురుగ్రామ్‌లో స్విగ్గీ ఏజెంట్ ను స్కార్పియో ఢీకొట్టిన డాక్టర్ ను అరెస్టు చేశారు. ఈ ఘటన సంచలనంగా మారింది. ఇంత చిన్న కారణానికి కారుతో ఢీకొట్టించాడా..? అని అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.  

సోమవారం రాత్రి గురుగ్రామ్‌లో తాగిన మైకంలో ఉన్న గవర్నమెంట్ డాక్టర్ తన SUV కారును స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌పైకి దూసుకెళ్లించాడని, నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గాయపడిన డెలివరీ ఏజెంట్ టింకు పన్వర్‌ను గురుగ్రామ్‌లోని సివిల్ ఆసుపత్రిలో చేర్చారు. నిందితుడిని  దౌలతాబాద్ లోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న నవీన్ యాదవ్ అనే ఆయుర్వేద వైద్యుడిగా గుర్తించారు పోలీసులు . యాక్సిడెంట్ కు కారణమైన బ్లాక్ స్కార్పియోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే డాక్టర్ ఈ ఘటనకు పాల్పడటానికి కారణం.. స్విగ్గీ ఏజెంట్లు రోజూ రోడ్డుపై అడ్డంగా ఉండటమేనట.  డాక్టర్ వెళ్లే దారిలో హయత్ పూర్ లో  స్విగ్గీ వేర్ హౌస్ ఆఫీసు ఉంది. పనులు చేస్తుండే క్రమంలో.. డెలివరీ ఏజెంట్లు రోడ్డుపైన ఉండేవారు. ఎప్పుడూ రోడ్డుపైన ఉండటంపై  ఆగ్రహించిన డాక్టర్ .. డెలివరీ ఏజెంట్‌ను తన కారుతో మెల్లగా ఢీకొట్టాడు. దీంతో ఎందుకు ఢీకొట్టావని ప్రశ్నిస్తే..  కోపోద్రిక్తుడై.. స్కార్పియోతో పదే పదే అతనిపైకి దూసుకెళ్లాడని పోలీసులు  తెలిపారు. 

స్విగ్గీ ఏజెంట్ భయపడి చెట్టు కిందకి పరిగెడితే.. వెంబడించినట్లు తెలిపారు. చెట్టు కింద ఆగి ఉన్న బైక్‌ను ఢీకొట్టడం, స్విగ్గీ డెలివరీ ఏజెంట్ గాయపడటం సీసీటీవీ ఫుటేజ్‌ లో క్లియర్ గా కనిపించింది. ఇతర డెలివరీ ఏజెంట్లు ప్రశ్నించడంతో  కోపంతో వాళ్లపైకి కూడా వాహనాన్ని తీసుకెళ్లే  ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా బైక్‌లను ధ్వంసం చేశాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని చెప్పారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.