దోమలు కుట్టి జనం చావటం లేదా.. కుక్కలు కరిస్తేనే మాట్లాడతారా..? : రేణు దేశాయ్

దోమలు కుట్టి జనం చావటం లేదా.. కుక్కలు కరిస్తేనే మాట్లాడతారా..? : రేణు దేశాయ్

వీధికుక్కలను చంపడంపై సినీ నటి రేణుదేశాయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కుక్కలు కరిస్తే చనిపోయేవారి ప్రాణాలనే లెక్కలోకి తీసుకుంటున్నారు.. రోడ్డు ప్రమాదాలు, దోమలతో చనిపోయేవారివిప్రాణాలు కాదా అని ప్రశ్నించారు. నాలుగైదు కుక్కులు అగ్రెసివ్ గా ఉంటే, వందల కుక్కలను చంపడం దారుణం అన్నారు. భూమిపై జీవిత హక్కు ప్రతి జీవికి ఉందని.. నిస్సాహయతతో కుక్కులను క్రూరంగా చంపడం ఏంటని నిలదీశారు. ప్రభుత్వాల వైఫల్యం వల్లే వీధికుక్కల ప్రమాదాలను ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు రేణుదేశాయ్.

ALSO READ | Ram Charan: ఒత్తిడి నాపై కాదు ప్రేక్షకులపైనే.. "స్టార్ కిడ్" ట్యాగ్ పై మనసు విప్పిన రామ్ చరణ్!

కుక్కలు కరిస్తే చనిపోతున్నారని ఇటీవల కాలంలో ఆ మూడజీవులపై దాడులు పెరిగాయి.. క్రూరంగా చంపేస్తున్నారు. కుక్కలు కరిస్తే చనిపోయే వారి సంఖ్యకంటే.. దోమలు కరిస్తే చనిపోయేవారు లక్షల్లో ఉన్నారని అన్నారు.వంద కుక్కల్లో 5 కుక్కలు మాత్రమే అగ్రెసివ్ గా ఉంటాయి..అలాంటిది ఐదు కుక్కల కోసం వంద కుక్కలను చంపుతారా అంటూ మండిపడ్డారు.  సుప్రీంకోర్టు ఒక రకమైన  తీర్పులను వెలువడిస్తే  వాటిని మరోరకంగా అర్థం చేసుకొని..  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు విధానాలతో కుక్కలను పూర్తిగా నిర్మూలించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయని మండిపడ్డారు.కుక్కకాటుకు ప్రభుత్వాల వైఫల్యాలే కారణమన్న ఆమె..నిస్సహాయతతో కుక్కలను చంపడం మంచిదికాదన్నారు. 

మరోవైపు  రోడ్డు ప్రమాదాల్లో  కూడా చాలా మంది చనిపోతున్నారు.. ప్రమాదాల్లో చనిపోయేవారికి ప్రాణాలు కావా అని ప్రశ్నించారు రేణుదేశాయ్.  దేశంలో ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు, దోమ కాటుతో, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, మానవత్వం వీడి కుటుంబ సభ్యులనే హతమరుస్తున్న  సంఘటనల్లో  లక్షలాది ప్రాణాలు పోతున్నారు.  వాటన్నిటినీ వదిలిపెట్టి  కేవలం కుక్కల వల్ల చనిపోయిన ప్రాణాలను మాత్రమే ప్రాణాలుగా  పరిగణిస్తే  ఎలా అని నిలదీశారు.

దేశంలో చెత్త నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్లే కుక్కలు పిల్లలకు జన్మనిస్తూ వాటి సంఖ్య పెరుగుతోందన్నారు రేణుదేశాయ్. ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు సరిగ్గా లేకపోవడంతో ఎదురయ్యే సమస్యను కుక్కలను చంపడం ద్వారా పరిష్కరిస్తాం అనుకుంటే పొరపాటు అని హెచ్చరించారు. ప్రభుత్వాలు అయినా, వ్యక్తులైన కుక్కలు క్రూరంగా హత్య చేసే కార్యక్రమాలకు తక్షణమే  ముగింపు పలకాలని డిమాండ్ చేశారు రేణుదేశాయ్.