గత 10 రోజులుగా మన దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకాయి. దింతో మకర సంక్రాంతి తరువాత పెళ్లిళ్ల సీజన్ రాక ముందే బంగారం ధరల్లో భారీ పెరుగుదలకు దారితీశాయి. ఈ ఏడాది జనవరి 5 నుండి జనవరి 14 వరకు చూస్తే 24 క్యారెట్ల (99.9% స్వచ్ఛత) బంగారం ధర సుమారు 6 వేలు పెరిగింది. రాబోయే నెలల్లో బంగారం ధరలు ఇలాగే పెరుగుతాయా లేదా తగ్గుతాయా అని సామాన్య ప్రజలు ఆందోళ చెందుతున్నారు....
అయితే బంగారం ధరలు రానున్న రోజుల్లో తగ్గుతాయా లేదా అనేది మార్కెట్ నిపుణులు కొంతవరకు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని (జనవరి 2026) దృష్టిలో ఉంచుకుంటే, రాబోయే కొన్ని నెలల్లో రెండు విషయాలు బంగారం ధరలు సూచిస్తున్నాయి.
గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో లాభాలు సాధించిన తర్వాత, మార్కెట్ ఇప్పుడు లాభాల బుకింగ్‌ను ఎదుర్కొంటున్నట్లు కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి 2026 మధ్య బంగారం ధరలు 10% నుండి 15% వరకు సాంకేతికంగా తగ్గుతాయని అంచనా.
అమెరికా సహా ఇతర దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు (పన్నులు/సుంకాలు) తగ్గితే, లేదా డాలర్ అకస్మాత్తుగా బలపడితే, పెట్టుబడిదారులు బంగారం నుండి డబ్బును ఇతర ఆస్తులకు మార్చవచ్చు. ఇది కూడా బంగారం ధరలలో తాత్కాలిక తగ్గుదలకు దారితీయవచ్చు.
చాలా ప్రపంచ ఆర్థిక సంస్థలు (జెపి మోర్గాన్ & గోల్డ్‌మన్ సాచ్స్ వంటివి) ఈ తగ్గుదలని తాత్కాలికంగా మాత్రమే భావిస్తున్నాయి. 2026 చివరి నాటికి బంగారం 10 గ్రాములకు రూ.150,000 నుండి రూ.160,000 వరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకుల కొనుగోళ్లు, ప్రపంచ అనిశ్చితి బంగారం ధరలను దీర్ఘకాలికంగా ఎక్కువగా ఉంచుతాయి.
బంగారం ఎప్పుడు కొనాలి ?
పెళ్లిళ్లు, శుభకార్యాల కారణంగా రాబోయే 2-3 నెలల్లో మీకు బంగారం అవసరమైతే, నిపుణులు వాయిదాల(SIP మోడ్)లో కొనమని సిఫార్సు చేస్తున్నారు. దీని అర్థం ఒకేసారి మొత్తం కొనడం కంటే, ధర తగ్గిన ప్రతిసారి కొంచెం కొనడం మంచిది.
ఫిబ్రవరిలో రాబోయే కేంద్ర బడ్జెట్ 2026లో ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని (దిగుమతి సుంకం) తగ్గించవచ్చు. సుంకంలో 2% తగ్గింపు కూడా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు 2వేల నుండి 3 వేల వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
