ఇండియన్ స్టాక్ మార్కెట్ పడిపోయింది. అలా ఇలా కాదు.. సెన్సెక్స్ 600 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు డౌన్ అయ్యింది. 2026, జనవరి 19వ తేదీ.. ఉదయం మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభం అయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ సైతం రెడ్ లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా ఈ విధంగా నష్టపోవటానికి కారణాలు ఏంటో చూద్దాం..
స్టాక్ మార్కెట్ పడిపోవటానికి కారణాలు :
>>> గ్రీన్ ల్యాండ్స్ కొనుగోలు చేయటానికి యూరప్ దేశాలపై అమెరికా విధిస్తున్న సుంకాలు. ఇప్పటికే 10 శాతం సుంకం విధించగా.. రాబోయే రోజుల్లో ఇది 25 శాతం వరకు ఉండొచ్చు అన్న భయం.
>>> మన స్టాక్ మార్కెట్ నుంచి 4 వేల కోట్ల విలువైన షేర్లను అమ్మేసిన విదేశీ పెట్టుబడిదారులు.
>>> క్వార్టర్ త్రీలో ఐటీ కంపెనీలు ఆశించిన స్థాయిలో వృద్ధిని చూపించలేదు. ఇదే సమయంలో డీల్ బుకింగ్స్.. ఆయా ఐటీ కంపెనీలకు కొత్త ఆర్డర్లు.. కొత్త వర్క్ అగ్రిమెంట్లు దారుణంగా పడిపోయాయి. దీంతో ఐటీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ పై బలంగా పడింది.
>>> పెట్టుబడిదారుల్లో భయం బాగా పెరిగింది. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో అనే ఆందోళనల మధ్య.. పెట్టుబడిదారులు ఆచితూచి స్పందిస్తున్నారు. పెట్టుబడి పెట్టకపోగా.. లాభాల్లో ఉన్న తమ షేర్లను అమ్మేస్తున్నారు.
>>> అమెరికా ఫెడరల్ రిజర్వ్ తర్వాత చైర్మన్ కెవిన్ కాదంటూ ట్రంప్ ప్రకటించటంతో.. విదేశీ పెట్టుబడిదారులు సైలెంట్ అయిపోయారు.
ఈ ఐదు కారణాల వల్లే ఇండియన్ స్టాక్ మార్కెట్ పడిపోయింది. బ్లాక్ మండేగా మారింది.
వెండి ఆల్ టైం రికార్డ్ :
స్టాక్ మార్కెట్ ఢమాల్ అంటే.. వెండి మెరిసిపోయింది. కిలో వెండి 3 లక్షల రూపాయలు దాటింది. ఇది ఆల్ టైం రికార్డ్. 2025 జనవరి నుంచి 2026 జనవరి వరకు.. ఈ 12 నెలల్లోనే.. కిలో వెండి లక్షా 40 వేల రూపాయలు పెరిగింది. ఇంకా పెరుగుతుందనే అంచనాలు మార్కెట్ లో ఉన్నాయి. కిలో వెండి 3 లక్షల రూపాయలు దాటడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చింది.
వెండి ఆల్ టైం రికార్డ్ ధరకు కారణాలు :
>>> పారిశ్రామిక అవసరాలకు విపరీతమైన డిమాండ్. సోలార్ పవర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ లో వినియోగం పెరిగింది. ఇండస్ట్రీయల్ అవసరాల కోసం కంపెనీలు పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టటంతో ధర అమాంతం పెరుగుతుంది.
>>> ట్రంప్ సుంకాల దెబ్బతో.. అమెరికన్ కంపెనీలు వెండి నిల్వ చేస్తున్నాయి. డిమాండ్ కు తగ్గట్టు సరఫరా లేకపోవటం కూడా ఓ కారణం.
>>> వెండి ధర ఇంకా పెరుగుతుందన్న అంచనాలతో.. చాలా కంపెనీలు అవసరానికి మించి కొనుగోలు చేయటం వల్ల వెండి ధర ఆల్ టైం రికార్డ్ ధరకు చేరింది.
