నా భార్యతో వేగలేకపోతున్నా.. విడాకులు ఇస్తున్నా : ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ప్రతీక్ సంచలన ప్రకటన

నా భార్యతో వేగలేకపోతున్నా.. విడాకులు ఇస్తున్నా : ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ప్రతీక్ సంచలన ప్రకటన

సమాజ్ వాది పార్టీ లీడర్, దివంగత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ప్రతీక్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తన వైవాహిక జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని ఇన్ స్టాలో  ఓ పోస్ట్ ద్వారా తెలిపాడు. ఇప్పడది   సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

తన భార్యతో వేగలేకపోతున్నానని.. ఆమెకు విడాకులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ప్రతీక్ యాదవ్ ప్రకటించారు. తన భార్య, బీజేపీ లీడర్  అపర్ణ యాదవ్ కు విడాకులిస్తున్నట్లు ఇన్ స్టా ద్వారా తన నిర్ణయాన్ని తెలిపారు. స్వార్థపూరిత మహిళకు నేను త్వరలో విడాకులిస్తున్నాను..ఆమె కేవలం ఫేమ్ కావడంకోసం నాకుటుంబ సంబంధాలను నాశనం చేసింది.. నేను తీవ్ర ఆందోళనలో ఉన్నా, మానసికంగా ఇబ్బంది పడుతున్నా ఆమె పట్టించుకోవడం లేదు.. టార్చర్ ఆపడం లేదు. ఇలాంటి మహిళను నేను ఎప్పుడూ చూడలేదు.. ఆమెను పెళ్లి చేసుకోవడం నా దురదృష్టం అంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు ప్రతీక్ యాదవ్. 

ప్రతీక్ యాదవ్-అపర్ణ యాదవ్ పెళ్లి.. 

2012లో ప్రతీక్ యాదవ్-అపర్ణ యాదవ్ ల వివాహం గ్రాండ్ గా జరిగింది. యూపీలోనే అత్యంత హై ప్రొఫైల్ పెళ్లిళ్లలో వీరి వివాహం ఒకటి. అమితాబ్ బచన్, జయాబచన్, అనిల్ అంబానీ లాంటి ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. స్కూల్ డేస్ నుంచే కలిసి ఉన్న వీరిద్దరు పదేళ్ల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 

ఎవరీ అపర్ణ యాదవ్..?

అపర్ణయాదవ్ .. సమాజ్ వాదీ పార్టీ నుంచే తన రాజకీయ కెరీర్ ను  ప్రారంభించారు. ములాయం సింగ్ యాదవ్  చిన్న కొడుకు అయిన ప్రతీక్ యాదవ్ ను  పెళ్లి చేసుకున్నాక.. 2017లో తొలిసారి లక్నో కాంట్ అసెంబ్లీ స్థానానికి సమాజ్ వాదీపార్టీ నుంచి  పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు. 2022లో సమాజ్ వాదీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అయితే అదే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు  సీటు కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. 2024లో యూపీ రాష్ట్ర మహిళా కమిషన్  వైస్ చైర్ పర్సన్ గా ఛాన్స్ దక్కింది.

►ALSO READ | చెరువులో దూసుకెళ్లిన కారు.. నీళ్లు చల్లగా ఉన్నాయని రక్షించలేని రెస్క్యూటీం..కళ్ల ముందే సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

గత కొంత కాలంగా ప్రతీక్ యాదవ్,  అపర్ణయాదవ్ ల మధ్య  అంతర్గత విభేదాలు తలెత్తడంతో  వివాదం కాస్త విడాకుల వరకు వచ్చింది. ఈ క్రమంలో తన వైవాహిక జీవితంపై కీలక నిర్ణయానికి సంబంధించిన ప్రతీక్ యాదవ్ ఇన్ స్టా పోస్ట్ సంచలనంగా మారింది.