అందరినీ ఏకంచేసే శక్తి ప్రియాంకే ఉంది​

అందరినీ ఏకంచేసే శక్తి ప్రియాంకే ఉంది​

కాంగ్రెస్​ ప్రెసిడెంట్​పదవికి రాహుల్​గాంధీ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త ప్రెసిడెంట్​గా ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా అయితే బాగుంటుందని పార్టీ సీనియర్ ​నేత, కేంద్ర మాజీ మంత్రి కరణ్​ సింగ్​అన్నారు. పార్టీలో అందరినీ ఒక్కటిగా కలిపే శక్తి ప్రియాంక గాంధీకే ఉందని ఆయన తెలిపారు. అధినేత లేకుండా ఎక్కువ కాలం కొనసాగడం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. రాహుల్​ గాంధీ స్థానంలో మరో యువ నేత ప్రెసిడెంట్​గా రావాలంటూ పంజాబ్ ​సీఎం అమరీందర్​సింగ్, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్​ చేసిన కామెంట్లను కరణ్​ సింగ్​సమర్థించారు. దేశంలో జనరేషన్​ మార్పు కనిపిస్తోందని, దానిని అంగీకరించి, అందుకు అనుకూలంగా మారాలన్నారు. ప్రియాంక తెలివైన యువతి అని, ఆమె సోన్​భద్ర విషయంలో చక్కగా స్పందించారని చెప్పారు. అయితే, కాంగ్రెస్ ​ప్రెసిడెంట్​పదవి చేపట్టాలంటూ ఆమెను బలవంతంగా ఒప్పించరాదన్నారు. ఆమె పార్టీ ప్రెసిడెంట్​అయితే మాత్రం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతారన్నారు. కాగా, లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్​ ప్రెసిడెంట్​పదవికి రాహుల్ గాంధీ మే 25న రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన రాజీనామాను కాంగ్రెస్​ వర్కింగ్​కమిటీ(సీడబ్ల్యూసీ) ఇంకా ఆమోదించలేదు. ఆగస్టు 10న సమావేశం కానున్నట్లు ఇటీవల ప్రకటించినందున పార్టీ ప్రెసిడెంట్​ఎన్నికకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.