నకిలీ విత్తనాల విక్రయాలపై నిఘా : సీపీ అనురాధ

నకిలీ విత్తనాల విక్రయాలపై నిఘా : సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: నకిలీ విత్తనాల రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, రైతులను మోసం చేయాలని చూస్తే పీడియాక్ట్ అమలు చేస్తామని సీపీఅనురాధ హెచ్చరించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కొంతమంది అక్రమార్కులు బ్రాండెడ్ కంపెనీ విత్తనాల పేరుతో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని, మరికొందరు కాలం చెల్లిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్త విత్తనాలు అని చెప్పి రైతులకు అంటగడుతున్నారన్నారు.

 నకిలీ విత్తనాలను అరికట్టడంలో వ్యవసాయశాఖ, టాస్క్ ఫోర్స్, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందితో కలిసి బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీరు నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ప్రత్యేక నిఘపెట్టి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిపారు.