కౌడిపల్లి, వెలుగు: మెదక్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న 5,201 ఇందిరమ్మ ఇండ్లకు ఇప్పటివరకు రూ.111 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. బుధవారం కౌడిపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు.
లబ్ధిదారులు త్వరితగతిన పనులు ప్రారంభించి, నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు
