మెదక్/తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లాలో మహాత్మా గాంధీ విగ్రహాలకు అవమానం జరిగింది. మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలోని గాంధీజీ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు పేడ కొట్టి, ఒక కన్ను ధ్వంసం చేసి, తలపై చెప్పు పెట్టారు. మంగళవారం రాత్రి ఈ చర్య జరగగా.. బుధవారం ఉదయం స్థానికులు గుర్తించారు.
గాంధీ విగ్రహాన్ని అవమాన పరిచిన వారిని గుర్తించి దుండగులను శిక్షించాలని మెదక్ మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ చంద్రపాల్, ప్రస్తుత వైస్ చైర్‌పర్సన్ దొంతి నరేశ్‌గౌడ్, కౌన్సిలర్ శివరామకృష్ణ , కాంగ్రెస్లీడర్లు నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని తాతపాపన్‌పల్లిలో గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
