జహీరాబాద్ మండలంలో రేషన్ బియ్యం పట్టివేత

 జహీరాబాద్ మండలంలో  రేషన్ బియ్యం పట్టివేత

జహీరాబాద్, వెలుగు: రేషన్ బియ్యాన్ని అక్రమంగా గుజరాత్ కు తరలిస్తున్న లారీని విజిలెన్స్ ఎన్​ఫోర్స్​మెంట్​, సివిల్ సప్లై అధికారులు  కలిసి పట్టుకున్నారు. ఆదివారం  జహీరాబాద్ మండలంలోని మాడిగి  చెక్ పోస్టు  వద్ద  సంయుక్తంగా  వాహన తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో రేషన్ బియ్యం తరలిస్తున్న  లారీని గుర్తించి  280 క్వింటాళ్ల  బియ్యాన్ని సీజ్ చేశారు. 

ఏపీలోని గుంటూరు జిల్లా దామలమద్ది గ్రామంలోని పద్మజ రైస్ ట్రేడర్స్ యజమాని కమలాపతి శ్రీనివాస్ రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొని గుజరాత్ లో ఎక్కువ ధరకు అమ్ముతాడాని అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.