కాలువ భూసేకరణకు రూ. 30 కోట్లు కేటాయించండి : ఎమ్మెల్యే హరీశ్ రావు

కాలువ భూసేకరణకు రూ. 30 కోట్లు కేటాయించండి : ఎమ్మెల్యే హరీశ్ రావు
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి  ఎమ్మెల్యే హరీశ్​ రావు లేఖ

సిద్దిపేట, వెలుగు :  కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా  సిద్దిపేట జిల్లాలో నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, శ్రీకొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లపై   కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్​  రావు  రాష్ట్ర నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు అవుతున్నా  నేటికీ జిల్లాలోని రిజర్వాయర్ల కు ఒక్క రూపాయి కూడా కేటాయించలేక పోగా గజం కాలువ తవ్వలేదన్నారు..  

మైనర్, సబ్ మైనర్ కాలువల నిర్మాణానికి భూసేకరణ చేపట్టాల్సి ఉందని ఈ విషయంపై  పలుమార్లు లేఖల రూపంలో, ఫోన్ల ద్వారా, వ్యక్తిగతంగానూ  కోరినట్టు ఆయన  గుర్తు చేశారు.   అన్నపూర్ణ(అంతగిరి) రిజర్వాయర్ ప్యాకేజ్-10కి రూ. 15కోట్లు, రంగనాయకసాగర్ (ప్యాకేజీ-11)  కోసం రూ. 15 కోట్లు కేటాయించాలని లేఖలో కోరారు.