రాజగృహపై దాడి దేశద్రోహం

రాజగృహపై దాడి దేశద్రోహం

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు
మంద కృష్ణమాదిగ
ఖమ్మం అర్బన్, తల్లాడ, వెలుగు: డాక్టర్ బీఆర్అంబేద్కర్ ప్రేమగా కట్టుకున్న రాజగృహపై జరిగిన దాడిని దేశద్రోహంగా పరిగణించి, కేసు నమోదు చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. దాడిని ఖండిస్తూ ఖమ్మం జెడ్ పీ సెంటర్లో, తల్లాడలో అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ దాడి ఘటనపై సీబీఐ విచారణ చేయించాలని కేంద్ర, మహరాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని, అంబేద్కర్ ఇంటికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలన్నారు. ఈ దాడికి నిరసనగా శనివారం నుంచి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన తెలుపుతామన్నారు.

ఈ నెల 18 వరకు ప్రతి గ్రామంలో ఇంటికొకరు చొప్పున భౌతిక దూరం, మాస్కులు ధరించి నిరసనలు వ్యక్తం చేయాలని కోరారు. ఖమ్మంలో జరిగిన నిరసనలో ఎంఆర్పీఎస్ నాయకులు బచ్చలకూర వెంకటేశ్వర్లు, తూరుగంటి అంజయ్య, మాదిగ గాజుల నర్సింహారావు, మాచర్ల కాంతి, పగిడిపల్లి ప్రభాకర్, తూరుగంటి రాము,కనకం జనార్దన్, ముదిరాజ్ సంఘం నాయకులు పతాని గోపి ముదిరాజ్, కందుల బాబు, బాకిశ్రీను, కనకరవి, దుడ్డెల్లి సైదులు, చాగంటి నర్సింహరావు, బుట్టి నాగేశ్వరరావు, జగ్జీవన్రావు, చందు తదితరులు పాల్గొన్నారు. తల్లాడలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు ఏపూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం