మే నెలలో 1714 కోట్ల భారీ ఆదాయాన్ని గడించిన పబ్జీ

మే నెలలో 1714 కోట్ల భారీ ఆదాయాన్ని గడించిన పబ్జీ

టెన్‌సెంట్ గేమ్స్ పేరు చెబితే అందరికీ తెలియకపోవచ్చు. కానీ పబ్‌ జీ గేమ్ అంటే చాలు దాదాపు గేమ్ ప్రియులందరికీ తెలుస్తుంది. కరోనా కారణంగా ఈగేమ్ భారీ ఎత్తున లాభాల్ని మూటగట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇండియా టైమ్స్ కథనం ప్రకారం.. డేటా అనలిటిక్స్ సంస్థ సెన్సార్ టవర్ 2020 మే నెలలో పబ్ జీ గేమ్  ప్రపంచంలో అత్యధిక ఆదాయాన్ని గడించే  మొబైల్ గేమ్ అని వెల్లడించింది. ఉచితంగా ఆడుకునే పబ్జీ గేమ్ వల్ల డెవలప్ చేసిన సంస్థ ఆదాయాన్ని ఎలా గడిస్తుందనే అనే అనుమానం రావొచ్చు. ఎందుకంటే గేమ్ ఆడే ప్రతీ ఒక్కరు అందుకు అవసరమైన టూల్స్ ను కొనుగోలు చేస్తున్నారని, ఆ కొనుగోళ్లు భారీ ఎత్తున జరుగుతున్నట్లు తెలిపింది. కాబట్టే ఒక్క మే నెలలోనే  1714కోట్ల భారీ ఆదాయాన్ని పబ్జీ గడించినట్లు  డేటా అనలటిక్స్ సంస్థ సెన్సార్ టవర్ ప్రకటించింది.