206 రన్స్‌‌‌‌ టార్గెట్‌‌ను ఛేదించిన కింగ్స్‌‌

206 రన్స్‌‌‌‌ టార్గెట్‌‌ను ఛేదించిన కింగ్స్‌‌

ఐపీఎల్‌‌‌‌‑15లో పంజాబ్‌‌ కింగ్స్‌‌ అద్భుతం చేసింది..! 206 రన్స్‌‌ భారీ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించేసింది..! శిఖర్‌‌ ధవన్‌‌ (29 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 43), భానుకా రాజపక్స (22 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 43) ఇచ్చిన మెరుపు ఆరంభానికి.. లాస్ట్‌‌లో ఒడియాన్‌‌ స్మిత్‌‌ (8 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 3 సిక్సర్లతో 25 నాటౌట్‌‌), షారూక్‌‌ ఖాన్‌‌ (20 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 2 సిక్సర్లతో 24 నాటౌట్‌‌) సూపర్‌‌ ఫినిషింగ్‌‌ ఇచ్చారు..! దీంతో ఫస్ట్‌‌ లీగ్‌‌ మ్యాచ్‌‌తోనే ఐపీఎల్‌‌ ఫ్యాన్స్‌‌కు అసలు సిసలు మజా చూపెట్టిన పంజాబ్‌‌.. బలమైన ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపింది..! మరోవైపు డుప్లెసిస్‌‌ (57 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 88) దంచికొట్టడంతో.. బెంగళూరు భారీ స్కోరు చేసినా.. బౌలింగ్‌‌ వైఫల్యంతో గెలవాల్సిన మ్యాచ్‌‌ను చేజేతులా జారవిడుచుకుంది..!

నవీ ముంబై: 

టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో వీరోచిత పోరాటం చూపెట్టిన పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌.. ఐపీఎల్‌‌‌‌లో బోణీ చేసింది. టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ మొత్తం సమయోచితంగా చెలరేగడంతో.. ఆదివారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో 5 వికెట్ల తేడాతో రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరుకు చెక్‌‌‌‌ పెట్టింది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 205/2 స్కోరు చేసింది. డుప్లెసిస్‌‌‌‌కు తోడుగా విరాట్‌‌‌‌ కోహ్లీ (29 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌, 2 సిక్సర్లతో 41 నాటౌట్‌‌‌‌), దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ (14 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 నాటౌట్‌‌‌‌) దంచికొట్టారు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన పంజాబ్‌‌‌‌ 19 ఓవర్లలో 208/5 స్కోరు చేసి గెలిచింది. మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ (32) ఫర్వాలేదనిపించాడు. స్మిత్​కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

డుప్లెసిస్‌‌‌‌ ధనాధన్‌‌‌‌

స్టార్టింగ్‌‌‌‌లో నెమ్మదిగా ఆడిన బెంగళూరు.. మ్యాచ్ మధ్యలో విధ్వంసం సృష్టించింది. ముఖ్యంగా డుప్లెసిస్‌‌‌‌, కోహ్లీ, కార్తీక్‌‌‌‌.. ఒకరికి మించి ఒకరు ఫోర్లు, సిక్సర్లు బాదడంతో ఆర్‌‌‌‌సీబీ భారీ స్కోరు సాధించింది. మూడో ఓవర్‌‌‌‌లో డుప్లెసిస్‌‌‌‌, అనూజ్‌‌‌‌ రావత్‌‌‌‌ (21) ఫోర్‌‌‌‌, సిక్సర్‌‌‌‌తో జోష్‌‌‌‌ తీసుకొచ్చారు. ఆరో ఓవర్‌‌‌‌లో రావత్‌‌‌‌ మరో రెండు ఫోర్లు కొట్టడంతో ఆర్‌‌‌‌సీబీ స్కోరు 41/0. కానీ నెక్స్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో రావత్‌‌‌‌ ఔట్‌‌‌‌కావడంతో ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 50 పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. 7 నుంచి 10వ ఓవర్‌‌‌‌ వరకు డుప్లెసిస్‌‌‌‌, కోహ్లీ, సింగిల్స్‌‌‌‌, డబుల్స్‌‌‌‌తోనే సరిపెట్టుకున్నారు. మధ్యలో కోహ్లీ సిక్సర్‌‌‌‌తో టచ్‌‌‌‌లోకి వచ్చాడు. ఈ నాలుగు ఓవర్లలో 29 రన్సే వచ్చినా.. 12వ ఓవర్‌‌‌‌ నుంచి డుప్లెసిస్‌‌‌‌ విశ్వరూపం మొదలైంది. లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌ బాల్‌‌‌‌ను స్టాండ్స్‌‌‌‌లోకి పంపిన డుప్లెసిస్‌‌‌‌.. స్మిత్‌‌‌‌ వేసిన తర్వాతి ఓవర్‌‌‌‌లో వరుసగా 4, 6, 6, కోహ్లీ 4 దంచడంతో 23 రన్స్‌‌‌‌ వచ్చాయి. 14వ ఓవర్‌‌‌‌లోనూ డుప్లెసిస్‌‌‌‌, కోహ్లీ కలిసి మూడు సిక్సర్లు దంచడంతో 21 రన్స్‌‌‌‌ వచ్చాయి. 15 ఓవర్లలో ఆర్‌‌‌‌సీబీ స్కోరు 142/1కి చేరింది. 16వ ఓవర్‌‌‌‌లో డుప్లెసిస్‌‌‌‌ మరో రెండు సిక్సర్లు సాధించాడు. ఆ వెంటనే మరో ఫోర్‌‌‌‌ కొట్టి 18వ ఓవర్‌‌‌‌లో వెనుదిరిగాడు. సెకండ్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 118 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. 19, 20వ ఓవర్లలో కార్తీక్‌‌‌‌ 6, 4, 6, 6, 4, 4తో వరుసగా 18, 16 రన్స్‌‌‌‌ రాబట్టడంతో ఆర్‌‌‌‌సీబీ స్కోరు 200లు దాటింది. 

స్మిత్‌‌‌‌.. అదరహో

భారీ లక్ష్య ఛేదనను పంజాబ్‌‌‌‌ దీటుగానే ఆరంభించింది. ఫోర్‌‌‌‌తో ఖాతా తెరిచిన ధవన్‌‌‌‌, మయాంక్‌‌‌‌ స్టార్టింగ్‌‌‌‌ నుంచే దంచికొట్టారు. సిరాజ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో ఫోర్‌‌‌‌, సిక్సర్‌‌‌‌తో టచ్‌‌‌‌లోకి వచ్చిన మయాంక్‌‌‌‌ క్రీజులో ఉన్నంతసేపు అల్లాడించాడు. 4వ ఓవర్‌‌‌‌లో మయాంక్‌‌‌‌ సిక్సర్‌‌‌‌, ధవన్‌‌‌‌ రెండు ఫోర్లు బాదడంతో 15 రన్స్‌‌‌‌ వచ్చాయి. పవర్‌‌‌‌ప్లే ముగిసేసరికి పంజాబ్‌‌‌‌ 63/0తో నిలిచింది. మయాంక్‌‌‌‌ను ఎనిమిదో ఓవర్‌‌‌‌లో ఔట్‌‌‌‌ చేయడంతో ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 71 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. రాజపక్స రావడంతో పంజాబ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ మరో మెట్టు ఎక్కింది. 10వ ఓవర్‌‌‌‌లో రాజపక్స 6, 4తో పంజాబ్‌‌‌‌ స్కోరు 97/1కి చేరింది. 11వ ఓవర్‌‌‌‌లో ధవన్‌‌‌‌ సిక్స్‌‌‌‌ కొడితే, రాజపక్స 4, 6తో 19 రన్స్‌‌‌‌ రాబట్టాడు. కానీ నెక్స్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో ధవన్‌‌‌‌ ఔట్‌‌‌‌కావడంతో సెకండ్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 47 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌ (19) ధాటిగా ఆడటంతో 13 ఓవర్లలో పంజాబ్‌‌‌‌ 139/2 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే 14వ ఓవర్‌‌‌‌లో వరుస బాల్స్‌‌‌‌లో సిరాజ్‌‌‌‌.. రాజపక్స, రాజ్‌‌‌‌ బవా (0)ను ఔట్‌‌‌‌ చేయడంతో స్కోరు 145/4గా మారింది. కొద్దిసేపటికే లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌ ఔటైనా షారూక్‌‌‌‌ ఖాన్‌‌‌‌, ఒడియాన్‌‌‌‌ స్మిత్‌‌‌‌ వేగంగా ఆడటంతో పంజాబ్‌‌‌‌ విజయానికి లాస్ట్‌‌‌‌ మూడు ఓవర్లలో 36 రన్స్‌‌‌‌ అవసరమయ్యాయి. సిరాజ్‌‌‌‌ (18వ ఓవర్‌‌‌‌) బౌలింగ్‌‌‌‌లో స్మిత్‌‌‌‌ 6, 4, 6, 6తో 25 రన్స్‌‌‌‌ పిండుకున్నాడు. తర్వాతి ఓవర్‌‌‌‌లో షారూక్‌‌‌‌ 6, 4తో పంజాబ్‌‌‌‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 

స్కోరు బోర్డు

బెంగళూరు: డుప్లెసిస్‌‌‌‌ (సి) షారూక్‌‌ (బి) అర్ష్‌‌దీప్‌‌ 88, అనుజ్‌‌ రావత్‌‌ (బి) చహర్‌‌ 21, కోహ్లీ (నాటౌట్‌‌) 41, దినేశ్‌‌ కార్తీక్‌‌ (నాటౌట్‌‌) 32, ఎక్స్‌‌ట్రాలు: 23, మొత్తం: 20 ఓవర్లలో 205/2. వికెట్లపతనం: 1–50, 2–168. బౌలింగ్‌‌: సందీప్‌‌ శర్మ 4–0–37–0, అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌ 4–0–31–1, ఒడియాన్‌‌ స్మిత్‌‌ 4–0–52–0, రాహుల్‌‌ చహర్‌‌ 4–0–22–1, హర్‌‌ప్రీత్‌‌ బ్రార్‌‌ 3–0–38–0, లివింగ్‌‌స్టోన్‌‌ 1–0–14–0. 

పంజాబ్‌‌ కింగ్స్‌‌: మయాంక్‌‌ (సి) షాబాజ్‌‌ అహ్మద్‌‌ (బి) డి సిల్వా 32, ధవన్‌‌ (సి) రావత్‌‌ (బి) పటేల్‌‌ 43, రాజపక్స (సి) షాబాజ్‌‌ (బి) సిరాజ్‌‌ 43, లివింగ్‌‌స్టోన్‌‌ (సి) రావత్‌‌ (బి) ఆకాశ్‌‌దీప్‌‌ 19, రాజ్‌‌ బవా (ఎల్బీ) సిరాజ్‌‌ 0, షారూక్‌‌ ఖాన్‌‌ (నాటౌట్‌‌)24, స్మిత్‌‌ (నాటౌట్‌‌) 25, ఎక్స్‌‌ట్రాలు: 22, మొత్తం: 208/5. వికెట్లపతనం:1–71, 2–118, 3–139, 4–139, 5–156. బౌలింగ్‌‌: డేవిడ్‌‌ విల్లే 3–0–28–0, సిరాజ్‌‌ 4–0–59–2, షాబాజ్‌‌ అహ్మద్‌‌ 1–0–6–0, ఆకాశ్‌‌ దీప్‌‌ 3–0–38–1, హసరంగ 4–0–40–1, హర్షల్‌‌ పటేల్‌‌ 4–0–36–1.