పంజాబ్ లోక్ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

పంజాబ్ లోక్ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

పంజాబ్ లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. తాజాగా పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఎలక్షన్స్ లో పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితాను పార్టీలు ప్రకటిస్తున్నాయి. తాజాగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ అమరీందర్ సింగ్ మొదటి జాబితాను విడుదల చేశారు. 22 మంది అభ్యర్థుల పేర్లను ఆయన ప్రకటించారు. 22 మంది అభ్యర్థులలో- మజా నుండి ఇద్దరు అభ్యర్థులు, దోబా నుండి ముగ్గురు. మాల్వా ప్రాంతం నుండి 17 మంది అభ్యర్థులు ఉన్నారు. మరో రెండు రోజుల్లో తమ పార్టీ రెండో జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు కెప్టెన్ అమరీందర్ సింగ్. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సలహాదారు మహ్మద్ ముస్తఫాపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన విషయంపై కూడా అమరీందర్ సింగ్ మాట్లాడారు. ముస్తఫా జైల్లో ఉండాల్సిన వ్యక్తి అన్నారు. అతని వీడియో విన్నానని.. పంజాబ్ శాంతికి విఘాతం కలిగించేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడని అమరీందర్ సింగ్ ఆరోపించారు. 

బీజేపీ, SAD (సంయుక్త్)తో పొత్తులో భాగంగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ ఇప్పటివరకు రాష్ట్రంలోని 117 సీట్లలో 37 స్థానాలను పొందింది. మరో ఐదు స్థానాలపై చర్చలు జరుగుతున్నాయి. అతని వాటాలోని 37 సీట్లలో, 26 మాల్వా ప్రాంతానికి చెందినవి.  కెప్టెన్ సింగ్ 2007 ఎన్నికలలో 2004 నీటి రద్దు చట్టంతో పాటు BTకాటన్‌ను ప్రవేశపెట్టడంతో ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఈ సారి కేంద్రం రైతు చట్టాలను రద్దు చేసే అంశం కూడా ఈ మాజీ ముఖ్యమంత్రికి కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.