రంగనాయక సాగర్​ కాల్వ పనుల్లో నాణ్యతా లోపం

రంగనాయక సాగర్​ కాల్వ పనుల్లో నాణ్యతా లోపం

రంగనాయక సాగర్ ప్రాజెక్టు ప్రారంభానికి ముందే కాల్వ సిమెంట్​లైనింగ్​కు పగుళ్లు ఏర్పడ్డాయి. రంగనాయక సాగర్​ స్లూయిస్ గేటు వద్ద కాలువ సమీపంలో ఉన్న ఇమాంబాద్​ చిన్న చెరువు  ఇటీవలి వర్షాలకు నిండింది. చెరువులోని నీరు కాల్వ సిమెంట్​లైనింగ్ పగుళ్ల నుంచి కాల్వ లోపలికి ధారలుగా  కారడం ప్రారంభ మైంది.  ఈ కాలువ  ద్వారానే  రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి మల్లన్న సాగర్​ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు.  ప్రాజెక్టు ప్రారంభానికి ముందే లైనింగ్​కు పగుళ్లు  ఏర్పడడంతో నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  – సిద్దిపేట, వెలుగు