V6 News

3టీ క్రికెట్‌కు రబాడ, మోరిస్‌ దూరం

3టీ క్రికెట్‌కు రబాడ, మోరిస్‌ దూరం

జొహన్నెస్‌బర్గ్‌: సౌతాఫ్రికాలో క్రికెట్‌ను రీస్టా ర్ట్‌‌ చేసేందుకు కొత్తగా ప్రవేశ పెడుతున్న త్రీ టీమ్‌ క్రికెట్‌ (3 టీసీ) సాలిడారిటీ కప్‌ మ్యాచ్‌కు పేసర్‌‌ కగిసో రబాడ, ఆల్‌రౌండర్‌‌ క్రిస్‌ మోరిస్‌ దూరమయ్యారు. శనివారం సెంచూరి యన్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. కుటుంబ సభ్యుల మరణంతో రబాడ, మీడియం పేసర్‌‌ సిసాండా మగలా ఈ మ్యాచ్‌‌ల్లో ఆడటం లేదు. ఇక 33 ఏళ్ల మోరిస్‌ కూడా అనివార్య కారణాలతో ఈ టోర్నీకి అందుబాటులో ఉండటం లేదని నిర్వాహకులు తెలిపారు. ఈ ముగ్గురి స్థానంలో మాజీ పేసర్ మఖాయ ఎన్తిని కొడుకు తాండో ఎన్తిని (కింగ్‌ఫిషర్స్‌), జోర్న్‌‌ ఫోర్టిన్‌‌ (ఈగల్స్‌), గెరాల్డ్‌ కొయెట్జీ (కింగ్‌ఫిషర్స్‌)ను తీసుకున్నారు. రబాడ గైర్హా జరీతో క్లాసెన్‌‌.. కింగ్‌ఫిషర్స్‌ టీమ్‌ను లీడ్‌ చేయనున్నాడు. డివిలియర్స్‌ (ఈగల్స్‌), డికాక్‌ (కైట్స్‌)కు సారథ్యం వహించనున్నారు. మొత్తం 24 మంది సఫారీ టాప్‌ క్రికెటర్లు ఈ మ్యాచ్​లో బరిలోకి దిగుతున్నారు.